మన దేశంలో 53 చైనీస్ కంపెనీలు : వెల్లడించిన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

మన దేశంలో 53 చైనీస్ కంపెనీలు : వెల్లడించిన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ :  భారతదేశంలో 53 చైనీస్ విదేశీ కంపెనీలు వ్యాపారాలను స్థాపించాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. మొబైల్​ యాప్‌‌‌‌ల ద్వారా లోన్లను అందించే  సంస్థలకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల డేటా అందుబాటులో లేదని తెలిపింది.    ఒక విదేశీ కంపెనీ (భారతదేశం వెలుపల ఇన్​కార్పొరేట్​ అయినది) ఆర్​బీఐ నిబంధనలు, అవసరాల ప్రకారం మనదేశంలో వ్యాపార స్థలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

అటువంటి కార్యాలయాన్ని స్థాపించిన 30 రోజులలోపు, కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్ 380 ప్రకారం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్​ఓసీ) (ఢిల్లీ, హర్యానా) వద్ద రిజిస్ట్రేషన్‌‌‌‌ను కోరుకోవాలి. సోమవారం లోక్‌‌‌‌సభలో కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి రావు ఇందర్‌‌‌‌జిత్ సింగ్ మాట్లాడుతూ, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 53 చైనా విదేశీ కంపెనీలు భారతదేశంలో వ్యాపార స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానంగా చట్టం ప్రకారం 'షెల్ కంపెనీ' అనే పదానికి నిర్వచనం లేదని మంత్రి అన్నారు.