
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : చిన్న పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బి. రోహిత్ రాజు హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ ముష్కాన్‌ను చేపడ్తున్నాయన్నారు. జులై ఒకటి నుంచి 31 వరకు బాల కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ ముస్కాన్‌ను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలు, హోటల్స్, ఇటుకబట్టీలు, దుకాణాల్లోఈ బృందాలు తనిఖీలు చేశాయి. 54 మంది బాల కార్మికులను గుర్తించారు. ఇందులో 44 మంది బాలురు, 10 మంది బాలికలున్నారు. 53 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించగా ఒకరిని మాత్రం హోంకు తరలించారు. చిన్న పిల్లలను పనుల్లో పెట్టుకున్న 39 మందిపై కేసులు నమోదు చేశారు.
13 మందికి నోటీస్‌లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా బాలలను పనిలో పెట్టుకుంటే డయల్ 100తో పాటు 112కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ఆపరేషన్ ముస్కాన్‌లో 54 మంది పిల్లలను గుర్తించడంలో బృందాలు చేసిన కృషిని అభినందించారు.