
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 55 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినవి ఉన్నాయి. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదుదారులు ఫైర్ అయ్యారు. అలాగే గ్రేటర్ లోని ఆరు జోన్లలో 97 ఫిర్యాదులు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 44, సికింద్రాబాద్ జోన్ 18 , శేరిలింగంపల్లి జోన్ 18, ఎల్బీనగర్ జోన్ 8, చార్మినార్ జోన్ 7, ఖైరతాబాద్ జోన్ లో 2 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు వేణుగోపాల్, సత్యనారాయణ, పంకజ, మంగతాయారు, సుభద్ర, సీఈ సహదేవ్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ప్రజావాణికి 185 ఫిర్యాదులు..
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 185 ఫిర్యాదులు వచ్చాయి. అర్జీలను కలెక్టర్ హరిచందన దాసరి స్వీకరించారు. ఇందులో అత్యధికంగా హౌసింగ్ శాఖ 130, ఇందిరమ్మ ఇండ్ల కోసం 117 దరఖాస్తులు ఉన్నాయి. వాట్సాప్ ద్వారా 82 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కదిరవన్ పలని తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలను నిర్లక్ష్యం చేయొద్దు
వికారాబాద్ : ప్రజావాణిలో వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా 45 అర్జీలను కలెక్టర్ స్వీకరించి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. అనంతరం స్కూళ్లలో పెయింటింగ్ పనులు, మైనర్ రిపేర్లు, బయోమెట్రిక్ అటెండెన్స్, ప్యాడీ ప్రొక్యూర్ మెంట్ అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్షచౌదరి, డీఆర్వో మంగీలాల్, ఆర్డీవో వాసుచంద్ర, ఏవో ఫర్హీనా బేగం తదితరులు పాల్గొన్నారు.