శ్రీలంకలో వరదలు బీభత్వం సృష్టి స్తున్నాయి. దిత్యా తుపాను కారణంగా కురు స్తున్న భారీ వర్గాలతో కొండచరియలు విరిగి పడ్డాయి. వరద దాటికి 600కి పైగా ఇండ్లు, స్కూళ్లు దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక సహదారులు, పాదాలు అల్ల దిగ్బంధమయ్యాయి. ఈ ఆకస్మిక వరదలతో ఇప్పటికే 56 మంది చనిపోగా.. మరో 21 మంది గల్లంతయినట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టా మని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలి కితీసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు. దిత్వా తుఫాను ఎఫెక్టుతో శ్రీలంక సర్కార్ దేశంలోని అన్ని ప్రభుత్వ ఆఫీసులు స్కూళ్లు మూసివేసింది. రైలు సర్వీసులు నిలిపి వేసింది.
వరద ప్రధానిత ప్రాంతాల్లో 20,500 మంది భద్రతా బలగాలు, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. దేశంలోని మరిన్ని ప్రాంతాలకు భారీ వరద ముప్పు ఉన్నట్లు స్థానిక వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.
