బర్డ్ ఫ్లూతో సముద్ర సింహాలు, పక్షులు మృతి

బర్డ్ ఫ్లూతో సముద్ర సింహాలు, పక్షులు మృతి

పెరూలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. మహమ్మారి కారణంగా అక్కడ 585 సముద్ర సింహాలు, 55వేల పక్షులు చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ బర్డ్ ఫ్లూకు H5N1 పేరు పెట్టినట్లు ప్రకటించింది. పెరూలోని 8 తీర ప్రాంతాల్లో చనిపోయిన పక్షులు, సముద్ర సింహాలను పరీక్షిస్తే..అవి బర్డ్ ఫ్లూ ద్వారా మృతి చెందినట్లు సెర్నాన్ప్ నేచురల్ ఏరియా ప్రొటెక్షన్ ఏజెన్సీ  తెలిపింది. 

చనిపోయిన జంతువులలో పెలికాన్‌లు, సముద్ర జంతువులు, పెంగ్విన్‌లు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. చనిపోయిన సముద్ర సింహాలకు ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించగా..వాటిల్లో  H5N1 వైరస్ వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో పెరూ ప్రభుత్వం ప్రజలకు తగిన సూచనలు చేసింది. సముద్ర పక్షులు, సముద్ర సింహాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.