
ఖైరతాబాద్, వెలుగు: డాక్టర్స్ డే సందర్భంగా జులై1న నెక్లెస్‌రోడ్డులో 5కె రన్ నిర్వహిస్తున్నట్లు ‘అమ్మణి’ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మలుగు ఆమని తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రన్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 7 గంటలకు రన్మొదలవుతుందని, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు.
బాలికలు, మహిళల ఆరోగ్యం, పకృతి, జీవన శైలిపై అవగాహన కల్పిస్తూ ఈ రన్నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసెంబీ స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొని రన్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు. సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షురాలు భారతి, న్యాయవాది ఎస్.జస్బీర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.