
దేశంలో ఐదో విడత ఎంపీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మే 20వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5.30 గంటల వరకు జరిగింది. అయితే, క్యూ నైన్ లో ఉన్న వారు ఓటు వేసేందు అధికారులు అనుమతించారు. ఇక, ఈరోజు ఉదయం నుంచే ప్రజల పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. పోలింగ్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రముఖ సినీ నటులు అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, మలైకా అరోరా, రకుల్ ప్రీత్ సింగ్, సంజయ్ దత్, కియార అద్వానీ, రణ్ వీర్ కపూర్, దీపికా పదుకునే, జాన్వీ కపూర్ సహా పలువురు ఓటు వేశారు. అలాగే కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్ నాథ్ సింగ్, పియూష్ గోయల్ ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, సినీ నటుడు మనోజ్ బాజ్ పేయ్ కుటుంబంతో కలిసి ఓటు వేశారు.
ఐదో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగింది. మొత్తం 695మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్, పీయూష్ గోయల్, రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లాతో పాటు పలువురు కీలక నేతల భవితవ్యం EVMలలో నిక్షిప్తం కానుంది. ఇప్పటి వరకు నాలుగు ఫేస్ లలో మొత్తం 379 లోక్ సభ సెగ్మెంట్లకు పోలింగ్ కంప్లీట్ అయింది.