కాల్పుల విరమణకు పాక్ తూట్లు.. ఆరుగురు పౌరులకు గాయాలు

కాల్పుల విరమణకు పాక్ తూట్లు.. ఆరుగురు పౌరులకు గాయాలు

శ్రీనగర్: దాయాది పాకిస్తాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కాశ్మీర్‌‌లోని లైన్ ఆఫ్​ కంట్రోల్ వెంబడి ఉన్న నౌగామ్, తంగ్ధర్ సెక్టార్స్‌లో శుక్రవారం పాక్ కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఆరుగురు పౌరులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ‘నార్త్‌ కశ్మీర్‌‌ జిల్లా, కుప్వారాలోని నౌగాం, తంగ్ధర్ సెక్టార్స్‌లో పాక్ కాల్పులకు తెగబడింది. మోటార్స్, ఆయుధాలతో కాల్పులకు దిగింది’ అని ఆర్మీ అధికారి చెప్పారు. పాకిస్తాన్ దూకుడుకు ఇండియన్ ఆర్మీ దీటుగా బదులిచ్చిందని పేర్కొన్నారు.