
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాటి ఓఆర్ఆర్ పై ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు గచ్చిబౌలి నుంచి పఠాన్ చెరు వైపు వెళ్తుండగా పాటి వద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన కారు నుజ్జనుజ్జ అయ్యింది. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరంతా జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.