దటీజ్ లావణ్య :6 జాబ్‌‌లు ఆమె సొంతం

దటీజ్ లావణ్య :6 జాబ్‌‌లు ఆమె సొంతం

అసలు సిసలు రైతు బిడ్డ. కానీ ఆమె పుస్తకం పట్టిందంటే 16 గంటల పాటు అలసట లేకుండా చదివేస్త ుంది. జంప్ చేసినా.. పరిగెత్తినా.. జింకలా దూసుకెళ్లేందుకు పోటీ పడుతుంది. అదే పట్టుదలతో వరుసగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, వీఆర్వో, జూనియర్ పంచాయతీ సెక్రటరీ, గ్రూప్–4, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ ఐ జాబ్ లకు సెలెక్టయింది. మొన్నటి దాకా మంచిర్యాల ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా పని చేసిన మంచికట్ల లావణ్య.. ఇప్పుడు సివిల్ ఎస్ ఐగా కొత్త కొలువులో చేరబోతోంది. ఆమె సక్సెస్ జర్నీ.. తన మాటల్లోనే..

మాది మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం శాంతాపూర్. డిగ్రీ పూర్తయ్యాక ఫస్ట్ టైం కాంపిటీటివ్ ఫీల్డ్‌ లోకి అడుగుపెట్టిన. ఎస్‌‌ఐ
కావాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అందుకే సబ్జెక్ట్‌‌లు, ప్రిపరేషన్ విధానం తెలియకున్నా చదవడం మొదలుపెట్టా. మ్యాథ్స్‌‌లో డౌట్స్ ఉంటే అక్క, అన్న చెప్పేవాళ్లు. కానీ 0.17 మార్కులతో ఎస్‌‌ఐ పోస్టు మిస్సయింది. చాలా బాధపడ్డా. ఎక్కడ తప్పు చేశానా అని వెరిఫై చేసుకున్న. కోచింగ్ వెళ్తే బెటర్ అన్పించింది. నా ప్రిపరేషన్‌‌కు, ఎగ్జామ్ ఓరియెంటేషన్‌‌కు మధ్య గ్యాప్ ఉందన్పించింది. హైదరాబాద్‌ లో గ్రూప్‌‌–2 కోచింగ్ తీసుకున్న. ఈసారి ఎస్‌‌ఐ కొట్టాలనే తపనతోనే చదివా. కోచింగ్ పోతే కాదు దానిని అర్థం చేసుకుని చదివితే కొలువులు వస్తాయని అర్థమైంది. అందులో భాగంగానే వీఆర్‌‌‌‌వో స్టేట్ 79 ర్యాం క్, గ్రూప్‌‌–4లో 154 ర్యాంక్, సివిల్ ఎస్‌‌ఐ ఓపెన్‌‌లో వచ్చాయి. నేను రాసినవాటిల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒక్కటే రాదనుకున్న. కానీ ఆ జాబ్‌ కూడా వచ్చేసరికి నాపై నాకు కాన్ ఫిడెంట్ లెవల్స్‌‌ పెరిగాయి.

రోజుకు 16 గంటలు 

2017లో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తయింది. అప్పుడే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ పడింది. పొద్దున్నే అంటే 4.30గంటలకే లేచి పుస్తకం పట్టుకునే దాన్ని. మార్నింగ్ నుంచి నైట్‌‌ వరకు దాదాపు 14 గంటలకు తక్కువ ఏ రోజూ చదవలేదు. పుస్తకం పడితే టైమ్ తెలిసేది కాదు. ఇష్టంగా చదివితే ఎంతసేపైనా కూర్చోవచ్చు అనేది నా లాజిక్. నాతో పాటు అన్నయ్య ఎస్‌‌ఐకి, తమ్ముడు కానిస్టేబుల్‌‌ జాబ్ కు ప్రిపేరయ్యారు. ముగ్గురం ఒక్క చోట చేరి సబ్జెక్ట్ డిస్కస్ చేసేవాళ్లం. మాట్లాడితే సబ్జెక్ట్. అంత డెడికేషన్‌‌తో చదివినం. తమ్ముడికి బీటెక్ థర్డ్ ఇయర్‌‌‌‌లో ఉండగానే కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. తర్వాత నాకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చింది.

జాబ్ చేస్తూ నే ఎస్ ఐ గోల్ 

మంచిర్యాలలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌‌‌‌గా జాబ్ చేస్తూనే ఎస్‌‌ఐ జాబ్‌ కు ప్రిపేరైన. రోజుకు రెండుగంటలు మాత్రమే టైం దొరికేది. రోజంతా వర్క్ టెన్షన్ ఉన్నా నైట్ మాత్రం 9 నుంచి 11వరకు చదివా. అది కూడా ఈవెంట్స్‌‌ అయ్యాక ఒక నెలరోజులు మాత్రమే పుస్తకం పట్టిన. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోసం చదివిన వాటినే రివిజన్ చేశా. ఇప్పుడు 249 మార్కులు వచ్చాయి. ఇంకొంచెం కష్టపడితే ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చేది కదా అన్న చిన్న బాధ ఉంది. ఫైనల్లీ నేను అనుకున్న జాబ్‌ ను సాధించానన్న హ్యాపినెస్ మాత్రం ఉంది.

ఆరు జాబ్‌‌లు ఆమె సొంతం


మేం మొత్తం నలుగురం. అన్నయ్య మంచికట్ల మహేందర్ జూనియర్ పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నాడు. అక్క మంచికట్ల స్రవంతి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్‌‌ రావడంతో ఇప్పుడు బీమారం మండలం దాంపూర్‌‌‌‌లో ఎఫ్‌ బీవోగా పనిచేస్తున్నారు. తమ్ముడు మంచికట్ల
రవీందర్ బెటాలియన్ కానిస్టేబుల్‌‌గా హైదరాబాద్‌ లో ఉన్నాడు. మమ్మల్ని భారం అనుకోకుండా చదివించిన అమ్మ లక్ష్మి, నాన్న గంగారాంల పేరు నిలబెడతం.