
- కర్నాటక ప్రభుత్వం ప్రపోజల్
బెంగళూర్: ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా కర్నాటక ప్రభుత్వం మహిళలకు వరాలిచ్చింది. వాళ్లకు 6 నెలల చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని సోమవారం అసెంబ్లీలో ప్రతిపాదించింది. విమెన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ కు సంబంధించి రూ.37,188 కోట్ల గ్రాంట్లను ప్రకటించింది. బడ్జెట్ను ప్రవేశపెట్టిన సీఎం యడియూరప్ప.. సిటీల్లోని అంగన్ వాడీలను బేబీ కేర్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని ప్రతిపాదించారు. ‘‘అడ్మినిస్ట్రేషన్లో భాగమైన మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక నుంచి వారికి మెటర్నిటీ లీవ్తో పాటు 6 నెలల చైల్డ్ కేర్ లీవ్ ఇస్తాం” అని ఆయన చెప్పారు. సర్వీస్ సెక్టార్లోని విమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్కు2 కోట్ల వరకు లోన్ ఇస్తామని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులతో మైక్రో ఎంటర్ ప్రైజెస్ ఏర్పాటు చేయిస్తామని, దీని ద్వారా 60 వేల మందికి లబ్ధి కలుగుతుందని చెప్పారు.
బస్ పాస్‌లో రాయితీ..
బెంగళూరులోని గార్మెంట్ కంపెనీలలో పనిచేసే మహిళా కార్మికులకు రాయితీపై బస్ పాసులు ఇస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకోసం30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. బెంగళూర్ లో 7,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.