
హైదరాబాద్, వెలుగు: గేమింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కంప్యూటర్ విజన్ వంటి వివిధ సెగ్మెంట్లలోని స్టార్టప్‌ల కోసం హైదరాబాద్‌లోని ఇమేజ్ సెంటర్‌లో ఆరు నెలల యాక్సిలరేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఇండియా మొత్తం మీద 23 స్టార్టప్‌లు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొననున్నాయి. సొసైటీపైన ప్రభావం ఎంత ఉంటుంది, బిజినెస్ మోడల్ బట్టి స్టార్టప్‌లను ఎంపిక చేశామని ఇమేజ్ సీఓఈ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇమేజ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ) కోసం రూ.19.68 కోట్లను కేటాయించగా, ఇందులో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) రూ.9.8 కోట్లు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ రూ. 3.5 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.4 కోట్లు, ఇండస్ట్రీ రూ.2.5 కోట్లు కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇమేజ్ ల్యాబ్‌నూ ఏర్పాటు చేసేందుకు రూ.4.4 కోట్లను కేటాయించారు. తాజాగా 23 స్టార్టప్‌లను 3 వ బ్యాచ్ కింద తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇమేజ్ సీఓఈ 10 స్టార్టప్ కంపెనీలకు రూ.50 లక్షల చొప్పున సీడ్ ఫండింగ్ అందించింది.