నర్సంపేట, వెలుగు : నర్సంపేట పోలీసుస్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి నర్సంపేట ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జీ ఎండీ యూసుఫ్ జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు టౌన్ సీఐ ముష్కే శ్రీనివాస్ తెలిపారు. నర్సంపేట మండలం దాసరిపల్లికి చెందిన పోతరాజు వెంకటయ్య, కమ్మపల్లికి చెందిన తప్పట్ల రాజు, నర్సంపేటకు చెందిన వేముల సురేశ్, గోక శ్రీనివాస్, నల్ల రజనీకాంత్, అంజనపల్లి వీరస్వామి ఇటీవల మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ తనిఖీలలో పట్టుబడ్డారని చెప్పారు.
ఈ ఆరుగురిలో ముగ్గురికి మూడ్రోజుల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా, మరో ఇద్దరికి రెండ్రోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా, ఒక్కరికి ఒక్క రోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించినట్లు వెల్లడించారు. జడ్జీ ఆదేశాల మేరకు ఆరుగురిని మహబూబాబాద్ జైలుకు తరలించినట్లు వివరించారు.
