టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు. దొంగ ఓట్లను గుర్తించి వాటిని తొలగిస్తే టీడీపీ రాద్దాంతం చేస్తుందని విమర్శించారు. టక్కు టమారీ విద్యలో చంద్రబాబు పీహెచ్ డీ చేశారని విమర్శించారు. చంద్రబాబు విద్యలు అందరికీ తెలుసన్నారు. గోడలు దూకడం.. అడ్డదారులు తొక్కడం చంద్రబాబుకు అలవాటుందని ఎద్దేవా చేశారు.
టీడీపీ అధినేత తీరు దొంగే దొంగ అని అరచినట్లు ఉందన్నారు సజ్జల. రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని వాటిని తొలగిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. దొంగ ఓట్లు వేసుకోవాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి లేదన్న సజ్జల ... ఆ 60 లక్షల ఓట్లు ఎవరివో కూడా తెలియదన్నారు.