60% యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లోనే: సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడి

60% యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లోనే: సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా యాక్టివ్ కేసుల్లో దాదాపు 60 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ సోమవారం ప్రకటించింది. మహారాష్ట్ర (21.9 శాతం), ఏపీ (11.7 శాతం), తమిళనాడు (10.4 శాతం), కర్నాటక (9.5 శాతం), ఉత్తరప్రదేశ్ లో (6.4 శాతం) యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఈ రాష్ట్రాల్లో రికవరీ అయిన కేసుల సంఖ్య కూడా 60%  ఉన్నట్లు చెప్పింది. దేశ వ్యాప్తంగా రికవరీ రేట్ 78 శాతానికి చేరినట్లు చెప్పింది. రికవరీ కేసులు, యాక్టివ్ కేసుల మధ్య గ్యాప్ క్రమంగా పెరుగుతోందని తెలిపింది. 92,071 కొత్త కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 22 వేల కేసులు, ఏపీలో 9,800 కేసులు నమోదైనట్లు తెలిపింది. 1,136 డెత్స్ లలో 53 శాతం మహారాష్ట్ర, కర్నాటక, యూపీ, తమిళనాడు, పంజాబ్, ఏపీలోనే ఉన్నట్లు చెప్పింది. ఆదివారం మహారాష్ట్రలో 36 శాతానికిపైగా డెత్స్ ( 416) నమోదైనట్లు పేర్కొంది. ఈ నెల 13 నాటికి దేశ వ్యాప్తంగా 5 కోట్ల 72 లక్షల 39 వేల 428 శాంపిల్స్ టెస్టు చేయగా, ఆదివారం ఒక్కరోజే 9 లక్షల 78 వేల 500 శాంపిల్స్ టెస్టు చేసినట్లు
ఐసీఎంఆర్ వెల్లడించింది.