నాగర్ కర్నూల్ జిల్లాలో 60 క్వింటాళ్ల రేషన్‌‌‌‌‌‌‌‌ బియ్యం పట్టివేత

నాగర్ కర్నూల్ జిల్లాలో 60 క్వింటాళ్ల రేషన్‌‌‌‌‌‌‌‌ బియ్యం పట్టివేత

కందనూలు, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 60 క్వింటాళ్ల రేషన్‌‌‌‌‌‌‌‌ బియ్యాన్ని రెవెన్యూ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎస్సై హరిప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం బావాజీపల్లి నుంచి నేరెళ్లపల్లి వెళ్లే రోడ్డుపై ఓ ట్రాక్టర్ అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు ఆపి, తనిఖీ చేశారు. 

అందులో 130 రేషన్ బియ్యం బస్తాలను గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్ నాగయ్యను ప్రశ్నించగా.. బావాజీపల్లి రేషన్ డీలర్  వెంకటస్వామికి చెందినవని చెప్పాడు. బియ్యాన్ని బ్లాక్ మార్కెట్​లో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు అధికారులు తేల్చారని, వారి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్​ను సీజ్​చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. బియ్యాన్ని బిజినేపల్లి గోదాంకు తరలించినట్లు తెలిపారు.