ఫలక్‌నుమ డిపో దగ్గర 60 మంది కార్మికులు అరెస్ట్

ఫలక్‌నుమ డిపో దగ్గర 60 మంది కార్మికులు అరెస్ట్

హైదరాబాద్ :  రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డీపోల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు విధుల్లోకి చేరడానికి వస్తున్న కార్మికులను అడ్డుకుంటున్నారు పోలీసులు. హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమ, ఫారూఖ్ నగర్ ఆర్టీసీ డిపోలలో విధులకు హాజరు కావడానికి వస్తున్న కార్మికులను అరెస్ట్ చేశారు ఫలక్‌నుమ పోలీసులు. రెండు డిపోల దగ్గర ఇప్పటి వరకు 60 మంది ఆర్టీసీ కార్మికులు అరెస్ట్ అయ్యారు. ఫలక్‌నుమ, ఫారూఖ్ నగర్ ఆర్టీసీ డిపోల దగ్గర భారీ పోలీసు బందోబస్తు మధ్య బస్సులు రోడ్డెక్కుతున్నాయి.

డిపోలకు వచ్చి పోయే రోడ్డులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని.. కార్మికులు ఎవరు కూడా డిపోల దగ్గరకు రాకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఫలక్‌నుమ ఆర్టీసీ డిపో దగ్గర డీసీపీ బాబురావు, అదనపు డీసీపీ జాగన్నాథ్ రెడ్డి, ఏసీపీ ఫలక్‌నుమ మాజిద్, ఏసీపీ ట్రాఫిక్ చార్మినార్ నాగన్న, ఫలక్‌నుమ డివిజన్ పోలీస్ అధికారులు ఉన్నారు. ఫలక్‌నుమ డిపో దగ్గర భాష్ప వాయువు ప్రయోగించే వాహనాన్ని కూడా ఉంచారు.

See Also: విధుల్లో చేరనీయకపోతే మిలిటెంట్ల యుద్ధమే