మేడారంలో ట్రాఫిక్ కంట్రోల్​కు  6 వేల మంది పోలీసులు

మేడారంలో ట్రాఫిక్ కంట్రోల్​కు  6 వేల మంది పోలీసులు

హనుమకొండ, వెలుగు: మేడారం జాతరలో ట్రాఫిక్​ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మేడారం ట్రాఫిక్ ​జోన్ ​ఇన్​చార్జ్,​ వరంగల్ సీపీ డా.తరుణ్​ జోషి తెలిపారు. హైదరాబాద్​, కరీంనగర్​, ఖమ్మం, ఛత్తీస్ గఢ్ ​వైపు నుంచి వచ్చే వెహికిల్స్​ ట్రాఫిక్​లో ఇరుక్కోకుండా యాక్షన్​ తీసుకుంటున్నట్లు చెప్పారు. మేడారంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేసులకు ఆల్ఫాబెటికల్​నంబర్స్​ కేటాయించినట్లు తెలిపారు. ఆర్టీసీ వెహికిల్స్​ సమ్మక్క గద్దెకు దగ్గరగా వెళ్లే అవకాశం ఉంటుందని, పార్కింగ్​ ప్లేస్​ 'ఏ' నుంచి 'జీ' కూడా గద్దెలకు సమీపంలోనే ఉంటాయన్నారు. ఇప్పటికే ఇసుక లారీలు ఆపేశామని, వాటిని మంగపేట రూట్​కు డైవర్ట్​ చేశామన్నారు. 10వ తేదీ నుంచి జవహర్​నగర్​ టోల్​ గేట్​నుంచి ఎలాంటి టోల్​ వసూళ్లు లేకుండా వెళ్లే ఏర్పాట్లు 
చేశామన్నారు.  
 

మూడు షిఫ్టుల్లో డ్యూటీ
మేడారం జాతరలో ట్రాఫిక్​ జోన్​ ను 20 సెక్టార్లుగా విభజించి, ముగ్గురు డీసీపీలను ఇన్​చార్జీలుగా నియమించినట్లు సీపీ చెప్పారు. కమిషనరేట్ ​నుంచి 11 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని, ఇందులో 6 వేల మందిని కంప్లీట్​గా ట్రాఫిక్​ డ్యూటీకే కేటాయించినట్లు తెలిపారు.  గట్టమ్మ టెంపుల్​దగ్గర రద్దీ దృష్ట్యా ఎస్పీ స్థాయి ఆఫీసర్​తో ట్రాఫిక్​ను పర్యవేక్షిస్తామన్నారు. ప్రతి సెక్టార్ కు ఒక అడిషనల్​ ఎస్పీ  లేదా డీఎస్పీలు ఇన్​చార్జీలుగా ఉంటారన్నారు.  30 బైక్​ టీమ్స్​ ఏర్పాటు చేశామని, ఈ టీమ్స్​ మూడు షిఫ్టుల్లో డ్యూటీ  చేస్తాయన్నారు. 
 

డ్రోన్లు, టోయింగ్​ వెహికిల్స్​ ఏర్పాటు
ఎన్​హెచ్​-163 నేషనల్​ హైవేపై ప్రతి 4 కిలోమీటర్లకు ఒక అవుట్​ పోస్ట్​ ఉంటుందని సీపీ చెప్పారు. మేడారం –-పస్రా రూట్​పై స్పెషల్​ ఫోకస్​ పెట్టామని, ఈ దారిలో ప్రతి అర కిలోమీటర్​ కు ఒక అవుట్​ పోస్ట్ పెట్టామన్నారు. జాతరకు వెళ్లే రూట్​ను డ్రోన్​ కెమెరాలతో పరిశీలిస్తామన్నారు. దీని కి సంబంధించి ఇప్పటికే కొంతమంది ఎక్స్​పర్ట్స్​ని నియమించామన్నారు. 380 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు.  మేడారం మార్గంలో టోయింగ్​ వెహికిల్స్​ ఏర్పాటు చేసి.. ట్రాఫిక్​ కు అంతరాయం కలగకుండా చూస్తామన్నారు. 
 

రోడ్లపై పార్క్​చేయొద్దు
రోడ్లపై వెహికిల్స్​ పార్క్​ చేయొద్దని సీపీ భక్తులకు సూచించారు. 21 హోల్డింగ్​ పాయింట్లు ఏర్పాటు చేశామని, ఎక్కడైనా రోడ్లపై గాని, పక్కన గాని పార్క్​ చేసినట్టు కనిపిస్తే టోయింగ్​ వెహికిల్స్​ ద్వారా తొలగిస్తామన్నారు. సీపీ వెంట డీసీపీ వెంకటలక్ష్మి ,  వరంగల్  కమిషనరేట్ లా అండ్ ఆర్డర్ అడిషనల్​ డీసీపీ పోతరాజు సాయి చైతన్య, సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, అడిషనల్​ డీసీపీ వైభవ్ గైక్వాడ్  ఉన్నారు.