V6 News

నవోదయ ఎంట్రెన్స్ కు 6196 మంది దరఖాస్తు

నవోదయ ఎంట్రెన్స్ కు 6196 మంది దరఖాస్తు

కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ లోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరం ఆరో తరగతి ప్రవేశం కోసం 6196 మంది స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకున్నట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ తెలిపారు. 

వీరంతా ఈ నెల 13న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం 24 కేంద్రాల్లో ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుందని, ఉదయం 10 గంటలకు స్టూడెంట్స్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.