తెలంగాణలో 67కు చేరిన కరోనా కేసులు

V6 Velugu Posted on Mar 29, 2020

తెలంగాణలో కరోనా మహమ్మారి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. శనివారం(28న) ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67కు చేరింది. శనివారం కరోనా పాజిటివ్ అని తేలినవారిలో నలుగురు కుత్బుల్లాపూర్‌‌లోని ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఫ్యామిలీలో ఓ వ్యక్తి (43) ఇటీవల ఢిల్లీవెళ్లొచ్చాడు. అతడి నుంచి కుటుంబంలోని మిగతాముగ్గురికి కరోనా సోకింది.  మిగతా నలుగురు రాష్ట్ర వైద్య ఆరోగ్యశా ఖకు చెందిన నలుగురు స్టాఫ్.. కరోనా వైరస్‌ బారినపడ్డారు. వీళ్లంతా ఎయిర్‌‌పోర్టులోని థర్మల్ స్ర్కీనింగ్‌ డ్యూటీలో పాల్గొన్నవారేనని మంత్రి ఈటల వెల్లడించారు. స్ర్కీనింగ్ సందర్భం లోనే వీరికి వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నలుగురిలో ఒకరి కుటుంబసభ్యుడికి కూడా వైరస్ సోకింది.

Tagged Telangana, corona, possitive, etala rajendar, casess67

Latest Videos

Subscribe Now

More News