నరోదా గామ్‌ అల్లర్ల కేసులో.. 68 మంది  విడుదల 

నరోదా గామ్‌ అల్లర్ల కేసులో.. 68 మంది  విడుదల 

అహ్మదాబాద్‌:  2002 గుజరాత్‌ అల్లర్ల నాటి నరోదా గామ్‌ కేసులో 60 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు విడుదల చేసింది. వీరిలో గుజరాత్‌ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు మాయా కొద్నానీ, బజరంగ్‌ దళ్‌కు చెందిన బాబు బజరంగీ సహా 68 మంది రిలీజ్‌ అయ్యారు. అహ్మదాబాద్‌లోని నరోదా గామ్‌లో ఇండ్లకు నిప్పు పెట్టడంతో 11 మంది ముస్లింలు మృతి చెందిన కేసులో అహ్మదాబాద్‌  కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

2017లో కొద్నానీకి.. డిఫెన్స్‌ సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్‌ షా కోర్టులో హాజరయ్యారు. 2002లో గుజరాత్‌లో సబర్మతి రైలు దహనం తర్వాత అల్లర్లు జరిగినప్పుడు అప్పటి ఆ రాష్ట్ర సీఎం మోడీ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా  ఉన్నారు.  మరోవైపు, 97 మందిని ఊచకోత కోసిన నరోడా పాటియా అల్లర్ల కేసులో కూడా కొద్నానీకి కూడా గతంలో కోర్టు 28 ఏండ్ల జైలు శిక్ష వేసింది.

ఆ తర్వాత ఆమెను గుజరాత్ హైకోర్టు విడుదల చేసింది. అలాగే, నరోదా గామ్‌ కేసులో 80 మందికి పైగా నిందితులు ఉండగా, విచారణ సమయంలో 18 మంది చనిపోయారు.