వేగంగా మారుతున్న జీవనశైలిలో పిల్లలు కూడా పెద్దలంతే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చదువు, పోటీ, గాడ్జెట్లు, సామాజిక ఒత్తిడి.. ఇవన్నీ పిల్లల్లో మానసిక ఆందోళన(Stress) కు కారణమవుతున్నాయి. సైకియాట్రిస్టుల ప్రకారం కింది లక్షణాలు కనిపిస్తే పిల్లలు స్ట్రెస్‌లో ఉన్నట్టుగా భావించాలి. పిల్లల్లో స్ర్టెస్ కు కారణాలను గుర్తించాలి. ఒత్తిడిని తగ్గించే పరిష్కార మార్గాలు వెదకాలి. పిల్లల్లో ఒత్తిడిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే వారి స్ట్రెస్ బారిన పడకుండా కాపాడవచ్చంటున్నారు.
పిల్లల్లో స్ట్రెస్ లక్షణాలు
- అకస్మాత్తుగా ప్రవర్తన మార్పులు – కోపం, చిరాకు, చిన్న విషయాలకు రియాక్ట్ అవ్వడం
- చదువుపై ఆసక్తి తగ్గడం – హోమ్‌వర్క్‌కి భయపడటం లేదా తప్పించుకోవడం
- నిద్రలేమి లేదా ఎక్కువగా నిద్రపోవడం
- తలనొప్పి, కడుపు నొప్పి వంటి శారీరక ఫిర్యాదులు
- మాట్లాడడంలో తగ్గుదల – కుటుంబ సభ్యులతో, స్నేహితులతో దూరంగా ఉండటం
- ఒంటరితనం కోరుకోవడం
- స్క్రీన్ టైమ్ పై అధిక ఆధారపడటం
- ఆహారపు అలవాట్లలో మార్పులు – ఎక్కువగా లేదా చాలా తక్కువగా తినడం
- పిల్లల్లో స్ట్రెస్‌కు కారణాలు
చదువు ,పరీక్షల ఒత్తిడి
- పేరెంట్స్ ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్
- సెల్ ఫోన్స్ వల్ల నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం
- సైబర్ బుల్లీయింగ్, సోషల్ మీడియా ఒత్తిడి
- ఫ్రెండ్స్ తో పోల్చడం
- పాఠశాల వాతావరణ సమస్యలు
సైకియాట్రిస్టుల సూచనలు: ఒత్తిడిని తగ్గించే మార్గాలు
- పిల్లలతో మాట్లాడేందుకు రోజూ కొంత సమయం కేటాయించాలి
- చదువులో ఒత్తిడి పెరగకుండా ఆరోగ్యకరమైన విధానం రూపొందించాలి.
- రోజుకు కనీసం 45 నిమిషాలు అవుట్‌డోర్ ఆటలను ఆడించాలి.
- సెల్ ఫోన్లు, ట్యాబులు వంటి స్క్రీనింగ్ టైం తగ్గించాలి.
- పిల్లలు ఏ సమస్య చెప్పినా విమర్శించకుండా విని అర్థం చేసుకోవాలి
- అవసరమైతే చైల్డ్ సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్టుని సంప్రదించాలి
