
బ్యాంకాక్: ఆసియా అండర్19 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా అమ్మాయిల జోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పోటీల్లో ఏడుగురు యువ బాక్సర్లు సెమీ-ఫైనల్స్‌లోకి దూసుకెళ్లి ఇండియాకు ఏడు మెడల్స్ ఖాయం చేశారు.
51 కేజీ క్వార్టర్ ఫైనల్లో యక్షిక3–2తో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముక్తసర్ అలియెవాను ఓడించగా.. 54 కేజీ బౌట్‌లో నిషా.. తన పంచ్‌లతో కిర్గిస్తాన్‌కు చెందిన మిలానా షిఖ్‌షబేకోవాపై విరుచుకుపడింది. దాంతో రిఫరీ బౌట్‌ను ఆపి నిషాను విన్నర్‌గా ప్రకటించారు. ఇతర బౌట్లలో ముస్కాన్ (57 కేజీ) 5–0తో రోబియా రవషనోవా (ఉజ్బెకిస్తాన్), నిషా (65 కేజీ)5–0తో యు-ఎన్ లీ (చైనీస్ తైపీ)పై, ఆర్తి కుమారి (75 కేజీ) 4–1తో జరీనా తోలిబాయ్ (కజకిస్తాన్)పై గెలిచారు. విని (60 కేజీ).. కిర్గిస్తాన్‌కు చెందిన అడెలియా అసిల్‌బెక్ కైజీని తొలి రౌండ్‌లోనే కుప్పకూల్చి సెమీస్ చేరగా.. ఆకాంక్ష ఫలాస్వాల్ (70 కేజీ) కూడా మంగోలియా బాక్సర్ గెరెల్ముంఖ్‌ను తొలి రౌండ్‌లోనే పడగొట్టింది. అయితే సుమన్ కుమారి (48 కేజీ) 2–3తో మఫ్తునా ముసుర్మోనోవా ( ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడి
నిరాశపరిచింది.