కరోనా టెస్టులకు ఎన్ని కిట్లు కావాలో తెలుసా..

కరోనా టెస్టులకు ఎన్ని కిట్లు కావాలో తెలుసా..

7 లక్షల టెస్ట్ కిట్​లు కావాలె

దేశంలో ప్రస్తుత పరిస్థితుల రీత్యా కొవిడ్-19 టెస్టులు చేసేందుకు దాదాపు 7 లక్షల టెస్ట్ కిట్​లు అవసరం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అంచనా వేసింది. ఇప్పటివరకూ విదేశాల నుంచి టెస్ట్ కిట్​లు దిగుమతి చేసుకుంటుండగా, లాక్​డౌన్​ల కారణంగా అవి ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే పెద్ద ఎత్తున టెస్ట్ కిట్​లను తయారు చేయాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. అందులో భాగంగా వాటిని తయారు చేసేందుకు కొటేషన్లు పంపాలంటూ కంపెనీలను ఆహ్వానించింది. యూఎస్ఎఫ్​డీఏ-ఈయూఏ/ సీఈ-ఐవీడీ/ ఐసీఎంఆర్-ఎన్ఐవీ పుణే ఆమోదించిన ఆర్ఎన్ఏ ఎక్స్​ట్రాక్షన్ కిట్ లను దేశంలో తయారు చేసి, సరఫరా చేసే కంపెనీలు అర్జెంటుగా ముందుకు రావాలని, శుక్రవారం (27వ తేదీ) మధ్యాహ్నం 2.30లోగా కొటేషన్లు పంపాలని కోరింది. అవసరమైతే, ఒకే కాంట్రాక్టును ఎక్కువ కంపెనీలకు ఇవ్వాలని కూడా ఐసీఎంఆర్ యోచిస్తోంది.  కరోనా మేనేజ్ మెంట్ ప్రొటోకాల్​ను తయారు చేసేందుకు ఎయిమ్స్  టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుత సమస్యలు, మున్ముందు రానున్న సవాళ్లను ఎదుర్కోవడంపై రిసోర్స్ మేనేజ్ మెంట్, హ్యూమన్ రిసోర్స్, డయాగ్నస్టిక్ మేనేజ్ మెంట్, మెడికల్ మేనేజ్ మెంట్  కమిటీలను వేసింది.

టెలిమెడిసిన్​కు గైడ్​లైన్స్​

కరోనా ట్రీట్​మెంట్​కు దేశవ్యాప్తంగా టెలీమెడిసిన్​ను కూడా అందుబాటులోకి తేవాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. బుధవారం గైడ్​లైన్స్​ విడుదల చేసింది.  హాస్పిటళ్లకు ఎక్కువ మంది  పేషెంట్లు వస్తే.. వారికి ట్రీట్ మెంట్ అందించడం కష్టమవుతుందని, డాక్టర్లు, నర్సులు, సౌకర్యాలు సరిపోక ఇబ్బందులు రావచ్చని, అటు డాక్టర్లకు, ఇటు పేషెంట్లకు కూడా ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుందని భావించిన కేంద్రం, టెక్నాలజీని ఉపయోగించుకుని టెలీమెడిసిన్ ట్రీట్ మెంట్ ప్రారంభించాలని సూచించింది. దీనివల్ల హాస్పిటళ్లు, డాక్టర్లపై ఒత్తిడి తగ్గుతుందని, డాక్టర్లకు, పేషెంట్లకు ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా తగ్గుతుందని తెలిపింది. ఎక్కడికక్కడ టెలీమెడిసిన్​కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. వైద్య ప్రమాణాలను, ప్రొటోకాల్స్​ను పాటిస్తూనే, వాయిస్, డేటా, ఇమేజెస్ ట్రాన్స్​మిషన్ ద్వారా టెలీమెడిసిన్ నిర్వహించాలని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాల పేషెంట్లు హాస్పిటళ్లకు రావల్సిన అవసరం లేకుండా, ఇంటి దగ్గరి  నుంచే గైడెన్స్, ట్రీట్​మెంట్ పొందేందుకు, ప్రిస్క్రిప్షన్స్ కూడా అందుకుని మందులు వాడేందుకు, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకూ టెలీమెడిసిన్ బాగా ఉపయోగపడుతుందని కేంద్రం వివరించింది.

For More News..

ఆన్​లైన్​లో కరోనా ట్రీట్‌మెంట్

అద్దె ఇంటి ఓనర్లకు సర్కారు వార్నింగ్