అంద‌రికీ బాగా ఇష్ట‌మైన ఏడు ఫుడ్ ఐట‌మ్స్ ఇవే..

అంద‌రికీ బాగా ఇష్ట‌మైన ఏడు ఫుడ్ ఐట‌మ్స్ ఇవే..

దేశంలోని అనేక ప్రాంతాలు పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో ప్రతీ ఒక్క ప్రాంతంలోనూ ఒక్కో వంటకం లేదా ఫుడ్ ఫేమస్ గా ఉంటుంది. ఉదాహరణకు మహారాష్ట్రలో వడాప్పావ్, గోల్ గప్ప ఫేమస్ అయితే.. తమిళనాడులో సాంబార్ ఫేమస్. ఇవి కేవలం ఫేమస్ మాత్రమే కాదు.. రుచిలోనూ ఏ మాత్రం తగ్గకుండా ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా శాఖాకారులు తినగలిగే బ్రేక్ ఫాస్ట్, ఫుడ్ ఐటెమ్స్ ఏమేం ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. వీటిలో వేటినైనా టేస్ట్ చేయకపోతే.. ఇప్పుడే టేస్ట్ చేయండి.

పనీర్ టిక్కా

పనీర్ టిక్కా లేదా పనీర్ సూలా లేదా చనా సూలా అని పిలుచుకునే ఈ భారతీయ వంటకాన్ని పనీర్ లేదా చనా ముక్కులు, మసాలా దినుసులతో మెరినేటి చేసి కాల్చడం ద్వారా తయారవుతుంది. చికెన్ టిక్కా, ఇతర మాంస పదార్థాలను తినని, తినలేని వారికి ఇది ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. అంతే కాదు చాలా మంది హాలీవుడ్ ప్రముఖులు, చెఫ్ ల మెనూలో ఈ వంటకం తప్పనిసరిగా ఉంటుందట.

మసాలా దోసె

ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చి దక్షిత భారత దేశంలోనే రుచికరమైన అల్పాహారంగా ప్రసిద్ది చెందిన ఈ మసాలా దోసె ఎంతో పేరు గాంచింది. దీన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు, విదేశాలలోనూ పలు రెస్టారెంట్లు, హోటళ్లలో చూడవచ్చు.

ఆలూ పరాఠా

ఆలూ పరాఠా అనేది ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన అల్పాహారం. ఇది మసాలా. బంగాళాదుంపల మిశ్రమాన్ని రోటీలో కలిపి తయారు చేస్తారు. ఆలు పరాఠా దక్షిణాసియా అంతటా కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది.

సమోసా

సమోసా 10వ శతాబ్దంతో మధ్య ప్రాచ్యంలో పుట్టుకొచ్చిందని చాలా మంది చెబుతుంటారు. ఢిల్లీ సుల్తానులు ఈ చిరుతిండిని పరిచయం చేశారని ప్రచారం కూడా ఉంది. ఇవి దక్షిణాసియా, మధ్య ప్రాచ్యం, మధ్య ఆసియా, తూర్పు ఆఫ్రికా వంటి అనేక ప్రాంతాల్లో సమోసాలు ఎంతో ప్రసిద్ది గాంచాయి. వీటిని చాలా మంది చిరుతిండిగా, సాయంకాలం వేళ టీ తాగుతూ ఆస్వాదిస్తూ ఉంటారు.

రాజ్మా చావల్

రాజ్మాను విదేశాల్లో కిడ్నీ బీన్స్ అని పిలుస్తారు. దీన్ని మెక్సికన్ ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వంటకం అక్కడి నుంచే వచ్చిందని చెబుతారు.

పానీ పూరీ

పానీ పూరీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఇష్టమైన చిరుతిండిలో ఇది ఒకటి. దీన్ని విదేశీయులు సైతం చాలా ఎంజాయ్ చేస్తూ తింటారంటే అతిశయోక్తి కాదు.

వెజిటెబుల్ బిర్యానీ

భారతదేశంలోనే కాదు.. వెజిటెబుల్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగానూ ప్రసిద్ది చెందింది. దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాలు సైతం దీన్ని మెనూలో స్పెషల్ కోర్స్ ఐటెంగా చేర్చుకుంటారు.