అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఏడుగురు మృతి

అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఏడుగురు మృతి

 

  • రాజస్తాన్‌‌‌‌లోని జైపూర్‌‌‌‌‌‌‌‌లో ఘటన 

జైపూర్‌‌‌‌‌‌‌‌: బంధువుల అంత్యక్రియలకు వెళ్లి, తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. రాజస్తాన్‌‌‌‌లోని జైపూర్‌‌‌‌‌‌‌‌లో ఈ ఘటన జరిగింది. తమ బంధువు ఒకరు చనిపోతే జైపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన రెండు ఫ్యామిలీలు అంత్యక్రియల కోసం ఓ కారులో హరిద్వార్‌‌‌‌‌‌‌‌ వెళ్లారు. కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తుండగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వారు ప్రయాణిస్తున్న కారు ప్రహ్లాదపుర దగ్గర్లోని జైపూర్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్‌‌‌‌ వద్ద అదుపు తప్పి, డివైడర్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టింది. 

ఆ వెంటనే16 అడుగుల లోతులో ఉన్న హైవే అండర్ పాస్‌‌‌‌లోని నీటిలోకి కారు దూసుకెళ్లి, మునిగిపోయింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్‌‌‌‌బాడీలను పోస్ట్‌‌‌‌మార్టం కోసం తరలించారు.