రాయల్ లైఫ్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లు చోరీ

రాయల్ లైఫ్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లు చోరీ

రాయల్ లైఫ్ కోసం ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు దొంగిలించే నలుగురు ముఠాను వికారాబాద్ జిల్లా పరిగి పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 14 లక్షలు విలువ చేసే  7 రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు, మూడు కెటియం బండ్లు, మూడు పల్సర్ బండ్లును వారి వద్ద నుండి పోలీసులు సీజ్ చేశారు.

నిందితుల్లో ఒకరైనా పరిగి మండలం సూల్తాన్ పూర్ గ్రామానికి చెందిన బిట్టు అలియాస్ రమేష్ అనే యువకుడు ఎలాంటి బండి కైనా తాలం క్షణాల్లో విరగోట్టడంలో దిట్ట.ఈ యువకుడు తన ముగ్గురు మిత్రులతో కలిసి ముఠాగా ఏర్పడి బైక్ చోరిలకు పాల్పడుతున్నట్లు పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. వీరంతా హైదరాబాద్, పరిగి, కర్ణాటక ప్రాంతాల్లో బైక్ లను చోరి చేసి దొంగిలించే ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఆమ్మడానికి ప్రయాత్నించే వారని డీఎస్పి తెలిపారు.

కుల్కచర్లలో దొంగలించిన బైక్ ను హైదరాబాద్ కు తరలిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో రాయల్ దొంగల ముఠా గుట్టు రట్టు అయినట్లు ఆయన తెలిపారు. వీరందరిపై పలు సెక్షన్ లలో కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. రాయల్ దొంగల ముఠా గుట్టు రట్టు చేసిన ముగ్గురు కానిస్టేబుల్ కు పరిగి డీఎస్పి రివార్డులు అందజేశారు.