ఐపీఎల్​ కొత్త టీమ్స్‌‌తో 7 నుంచి 10 వేల కోట్ల ఆదాయం

ఐపీఎల్​ కొత్త టీమ్స్‌‌తో 7 నుంచి 10 వేల కోట్ల ఆదాయం
  • రెండు జట్లకు ఇవాళే బెట్టింగ్
  • ఫ్రాంచైజీల ప్రకటనకు మరికొంత సమయం

దుబాయ్‌‌:  ఐపీఎల్‌‌లో రెండు కొత్త ఫ్రాంచైజీల ద్వారా ఏడు  నుంచి పది వేల కోట్ల రూపాయాల ఆదాయం వస్తుందని బీసీసీఐ ఆశిస్తోంది. వచ్చే సీజన్‌‌ నుంచి మెగా లీగ్‌‌లో చేరే రెండు టీమ్స్‌‌ కోసం సోమవారం బిడ్డింగ్‌‌ ప్రక్రియ మొదలవనుంది. , బిడ్స్‌‌ను పూర్తిగా పరిశీలించి సమయం పడుతుంది కాబట్టి కొత్త ఫ్రాంచైజీలను అదే రోజు  ప్రకటించే చాన్స్​ లేదని  బోర్డు వర్గాలు చెబుతున్నాయి.  

రెండు ఫ్రాంచైజీల కోసం 22 కంపెనీలు టెండర్‌‌ డాక్యుమెంట్స్​ కొనుగోలు చేశాయి. కొత్త టీమ్స్‌‌కు బేస్‌‌ ప్రైజ్‌‌ రెండు వేల కోట్లు కాగా, బిడ్డింగ్‌‌లో ఆ రేటు రెండు నుంచి మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. దాంతో, ఇంత పెద్ద మొత్తం ఖర్చుచేసేందుకు ఆరు కంపెనీలు మాత్రమే రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇండియా వ్యాపార దిగ్గజాల్లో ఒకరైన గౌతమ్‌‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌‌.. అహ్మదాబాద్‌‌ ఫ్రాంచైజీ కోసం బిడ్‌‌ వేయొచ్చు. మరో బిజినెస్‌‌ టైకూన్‌‌.. సంజీవ్‌‌ గోయెంకాకు చెందిన ఆర్‌‌పీఎస్‌‌జీ గ్రూప్ కూడా సీరియర్‌‌ బిడ్డర్స్‌‌లో ఒకటిగా కనిపిస్తోంది.

ఫారిన్‌‌ నుంచి మాంచెస్టర్‌‌ యునైటెడ్‌‌ ఫుట్​బాల్‌‌ క్లబ్‌‌ యాజమాన్యానికి చెందిన లాన్సర్‌‌ గ్రూప్‌‌ కూడా బిడ్‌‌ డాక్యుమెంట్‌‌ కొనుక్కుంది. అలాగే, ప్రముఖ ఫార్మా కంపెనీలు అరబిందో ఫార్మా, టోరెంట్‌‌ గ్రూప్‌‌తో పాటు కోటక్‌‌ గ్రూప్‌‌ కూడా రేసులో ఉన్నాయి. టీమిండియా మాజీ ఓపెనర్‌‌ ఒకరు ఓ కన్సార్టియంతో కలిసి కొత్త ఫ్రాంచైజీ కొనుగోలుకు సీరియస్‌‌గానే ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది.