70 వేల సంతకాలతో గోరక్షణ ఉద్యమం : కామాఖ్య ఆలయ ప్రధాన అర్చకులు మంథని సతీశ్భవానీ

70 వేల సంతకాలతో గోరక్షణ ఉద్యమం :  కామాఖ్య ఆలయ ప్రధాన అర్చకులు మంథని సతీశ్భవానీ

కోల్​బెల్ట్, వెలుగు: దేశంలో గో సంరక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్​ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన70 వేల సంతకాలను ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానిని కలిసి అందజేయనున్నట్లు రాష్ట్ర గో సమ్మాన్​ఆహ్వాన్​అభియాన్ ​బాధ్యులు, కామాఖ్య ఆలయ ప్రధాన అర్చకులు మంథని సతీశ్​భవానీ తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్ ​క్లబ్​లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 5,6 తేదీల్లో ఢిల్లీలో అన్ని రాష్ట్రాల గో సంరక్షణ బాధ్యులు, కార్యకర్తలతో జాతీయ స్థాయి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ బాధ్యతలు మందమర్రిలోని కామాఖ్య ఆలయానికి అప్పగించినట్లు తెలిపారు. మంగళవారం ఢిల్లీకి తరలివెళ్తామని, తెలంగాణలో జరుగుతున్న గోవధ, కబేళాల నిర్మూలన, గో సంరక్షణ చట్టం, గోవులను జాతీయ ప్రాణిగా గుర్తించాలని డిమాండ్​ చేస్తూ జాతీయ సమ్మేళనంలో వెల్లడిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 40 కోట్ల సంతకాల సేకరణలో భాగంగా ఇప్పటికే 22 కోట్లు సేకరించినట్లు పేర్కొన్నారు. గో సంరక్షణ బాధ్యులు, ఆలయ కమిటీ సభ్యులు రాజా శాక్తేయ, మనోజ్ శర్మ, సోమయ్య, బోరిగం ముఖేశ్, డోలే సురేశ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.