70th National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డులు..విన్నర్స్ లిస్ట్ ఇదే

70th National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డులు..విన్నర్స్ లిస్ట్ ఇదే

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను (70th National Awards 2024) కేంద్ర ప్రభుత్వం శుక్ర‌వారం (ఆగస్ట్ 16న)  ప్ర‌క‌టించింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు పురస్కారాలు అందిస్తున్నారు. తాజాగా హీరో నిఖిల్ కార్తికేయ‌ 2 సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు వరించింది. ఈ ఒక్కటి మిన‌హా తెలుగు ఇండ‌స్ట్రీకి మ‌రే అవార్డు రాక‌పోవ‌డంతో..తెలుగు సినిమాకు నిరాశే ఎదురైంది.

ఈ సారి జాతీయ అవార్డుల్లో మ‌ల‌యాళం, క‌న్న‌డ, త‌మిళ‌ సినిమాలు ఎక్కువ‌గా అవార్డుల‌ను గెలుచుకున్నాయి. బెస్ట్ ఫిల్మ్‌గా మ‌ల‌యాళం మూవీ ఆట్ట‌మ్ అవార్డును గెలుచుకున్న‌ది. ఉత్తమ నటుడుగా కాంతార మూవీకిగాను రిష‌బ్ శెట్టి అవార్డును సొంతం చేసుకున్నాడు. ఉత్తమ హీరోయిన్ అవార్డు ఈ సారి ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ద‌క్కింది. నిత్యామీన‌న్ (తిరుచిత్రాంబ‌ళం), మాన‌సి ప‌రేఖ్ (క‌చ్ ఎక్స్‌ప్రెస్ గుజ‌రాతీ మూవీ) అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డుల కోసం పలు భాషల సినిమాలు పోటీ పడగా..ఏఏ రంగాలలో ఎవరెవరికి పురస్కారాలు వరించాయో తెలుసుకుందాం. 

అవార్డుల వివరాలు: 

ఉత్తమ ఫీచర్‌ సినిమాలు:

  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): కార్తికేయ 2
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం): పొన్నియిన్‌ సెల్వన్‌ – 1
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (పంజాబీ): బాగీ డి దీ
  • స్పెషల్‌ మెన్షన్‌: గుల్‌మోహర్‌ (హిందీ), నటుడు: మనోజ్‌ బాజ్‌పాయ్; కదికన్‌ (మలయాళం), సంగీత దర్శకుడు: సంజోయ్‌ సలీల్‌ చౌదురి
  • ఉత్తమ చిత్రం: ఆట్టమ్‌ (మలయాళం)
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమా: బ్రహ్మాస్త్ర – పార్ట్‌ 1: శివ (హిందీ)
  • బెస్ట్‌ ఫిల్మ్‌ ప్రమోటింగ్‌ నేషన్‌, సోషల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ వాల్యూస్‌: కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ (గుజరాతీ)
  • ఉత్తమ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌: కాంతార (కన్నడ)
  • ఉత్తమ దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్‌ కుమార్‌, ఫౌజా (హరియాన్వీ)
  • ఉత్తమ నటుడు: రిషబ్‌ శెట్టి (కాంతార – కన్నడ)
  • ఉత్తమ దర్శకుడు: సూరజ్‌ బర్జాత్యా (ఉంచాయి – హిందీ)
  • బెస్ట్ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: శ్రీపాథ్‌ (మలికాపురమ్‌ – మలయాళం)
  • ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)
  • ఉత్తమ సహాయ నటుడు: పవర్‌ రాజ్‌ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి)
  • ఉత్తమ నటి: నిత్య మేనన్‌ (తిరుచిత్రాంబళం – తమిళం), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ – గుజరాతి)
  • బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ – 1 (తమిళం), సినిమాటోగ్రాఫర్‌: రవి వర్మన్‌
  • బెస్ట్‌ ఫిమేల్ ప్లే బ్యాక్‌ సింగర్‌ : బాంబే జయశ్రీ (చాయుమ్‌ వెయిల్‌), సౌదీ వెల్లక్క సీసీ 225/2009
  • ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ : అర్జిత్‌ సింగ్‌ (కేసరియా) – బ్రహ్మాస్త్ర- పార్ట్‌ 1: శివ (హిందీ)
  • బెస్ట్‌ కొరియోగ్రీఫీ: జానీ మాస్టర్‌, సతీష్‌ కృష్ణన్‌ తిరుచిత్రాంబళం (తమిళ్‌)
  • బెస్ట్‌ లిరిక్స్‌: ఫౌజా (హరియాన్వీ), రచయిత: నౌషద్‌ సదర్‌ ఖాన్‌
  • ఉత్తమ సంగీతం (పాటలు): బ్రహ్మస్త్ర: శివ (హిందీ) – ప్రీతమ్‌
  • ఉత్తమ సంగీతం (నేపథ్యం): పొన్నియిన్‌ సెల్వన్‌ – 1 (తమిళ్‌), సంగీత దర్శకుడు: ఏఆర్‌ రెహమాన్‌
  • బెస్ట్‌మేకప్‌: అపరాజితో (బెంగాళీ), ఆర్టిస్ట్‌: సోమనాథ్‌ కుందు
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (ఒడియా): దమన్‌
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మలయాళం): సౌది వెళ్లక్క సీసీ 225/2009
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మరాఠీ): వాల్వీ (ది టెర్మైట్‌)
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (కన్నడ): కేజీయఫ్‌ 2
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) : గుల్‌మోహర్‌
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (బెంగాళీ): కబేరి అంతర్దాన్‌
  • బెస్ట్‌ టివా ఫిల్మ్: సికాసిల్‌
  • బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: కుచ్‌ ఎక్స్‌ప్రెస్‌ (గుజరాతీ), డిజైనర్‌: నిక్కి జోషి
  • బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌ : అపరాజితో, డిజైనర్‌: ఆనంద అద్య
  • బెస్ట్‌ ఎడిటింగ్‌: ఆట్టం, ఎడిటర్‌: మహేష్‌ భువనేండ్‌
  • బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: పొన్నియిన్‌ సెల్వన్‌ – 1 (తమిళం), డిజైనర్‌: ఆనంద్‌ కృష్ణమూర్తి
  • బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): ఆట్టం – ఆనంద్‌ ఏకార్షి,
  • డైలాగ్‌ రైటర్‌: గుల్‌మోహర్‌: అర్పితా ముఖర్జీ, రాహుల్‌ వి చిట్టెల
  • బెస్ట్‌ యాక్షన్‌ డైరక్షన్‌: అన్బరివు (కేజీయఫ్‌ 2)

నాన్‌ ఫీచర్‌ సినిమాలు

  • బెస్ట్‌ డాక్యుమెంటరీ: ‘మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌’ – మరాఠీ
  • బెస్ట్‌ ఆర్ట్స్‌ / కల్చర్‌ ఫిల్మ్‌: రంగ విభోగ (టెంపుల్‌ డ్యాన్స్‌ ట్రెడిషన్‌) – కన్నడ
  • బెస్ట్‌ ఆర్ట్స్‌ / కల్చర్‌ ఫిల్మ్‌: వర్ష (లెగసీ) – మరాఠీ
  • బెస్ట్‌ డెబ్యూ ఫిల్మ్‌ ఆఫ్‌ ఏ డైరెక్టర్‌ – మధ్యంతర (ఇంటర్‌మిషన్‌) – కన్నడ, దర్శకుడు: బస్తి దినేశ్‌ షెనోయ్‌
  • బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్: అయనా (మిర్రర్‌)
  • బెస్ట్‌ డైరక్షన్‌: ‘ఫ్రమ్‌ ది షాడో’ (బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్‌), దర్శకుడు: మిరియం చాండీ మినాచెరీ
  • బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ఉన్యుత (వాయిడ్‌) – అస్సామీ
  • బెస్ట్‌ యానిమేషన్‌ సినిమా: ఏ కోకోనట్‌ ట్రీ (సైలెంట్‌)
  • బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ ప్రమోటింగ్‌ సోషల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటర్‌ వాల్యూస్‌: ‘ఆన్‌ ది బ్రింక్‌ సీజన్‌ 2 – ఘరియాల్‌) – ఇంగ్లిష్‌
  • బెస్ట్‌ ఎడిటింగ్‌: మధ్యంతర (ఇంటర్‌మిషన్‌) – కన్నడ, ఎడిటర్‌ (సురేశ్‌ యూఆర్‌ఎస్‌)
  • బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: యాన్‌ (వెహికల్‌) – హిందీ/ మాల్వి, సౌండ్‌ డిజైనర్‌: మానస్‌ చౌధురి
  • బెస్ట్‌ సినిమాటోగ్రీఫీ: మోనో నో అవేర్‌ (హిందీ – ఇంగ్లీష్‌), సినిమాటోగ్రాఫర్‌: సిద్ధార్థ్‌ దివాన్‌
  • బెస్ట్ నెరేషన్‌ / వాయిస్‌ ఓవర్‌: మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌ (మరాఠీ), వాయిస్‌ ఓవర్‌: సుమంత్‌ శిందే
  • బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: ఫుర్సత్‌ (లీజర్‌) – విశాల్‌ భరద్వాజ్‌
  • ఉత్తమ స్క్రిప్ట్‌: మోనో నో అవేర్‌ (హిందీ – ఇంగ్లిష్‌), రచయిత: కౌశిక్‌ సర్కార్‌
  • స్పెషల్‌ మెన్షన్‌: బిరుబాలా ‘విచ్‌ టు పద్మశ్రీ (అస్సామీ), హర్గిలా – ది గ్రేటర్‌ అడ్జుటెంట్‌ స్టార్క్‌ (అస్సామీ)
  • బెస్ట్‌ బుక్‌ ఆన్‌ సినిమా: కిషోర్‌ కుమార్‌ (ది అల్టిమేట్‌ బయోగ్రఫీ) – ఇంగ్లిష్‌, రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్‌ ధార్‌
  • ఉత్తమ క్రిటిక్‌: దీపక్‌ దుహా (హిందీ)