ఆక్సిజన్ కొరతతో గోవాలో 4రోజుల్లో 74 మంది మృతి

ఆక్సిజన్ కొరతతో గోవాలో 4రోజుల్లో 74 మంది మృతి

గోవా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా భారీ సంఖ్యలో కరోనా బాధితులు చనిపోతున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో సుమారు 74 మంది రోగులు కొవిడం ఆసుప్రతుల్లో మరణించారు. వీరంతా ఆక్సిజన్‌ అందక చనిపోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం కూడా మరో 13 మంది కరోనా పేషెంట్లు మృతి చెందినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి విజయ్ సర్దేశాయ్ తెలిపారు. వీరంతా అర్థరాత్రి 1 నుండి ఉదయం 6 గంటల మధ్య చనిపోయారని చెప్పారు. అదేవిధంగా గురువారం 15 మంది రోగులు మృతి చెందారు. బుధవారం 20 మంది, మంగళవారం 26 మంది కొరో7నా రోగులు  చనిపోయారని ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ వారం ఆస్పత్రిని సందర్శించిన గోవా సీఎం ప్రమోద్‌ సావత్‌..ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత, సరఫరా మధ్య అంతరాయం ఈ సమస్యలకు కారణంగా చెప్పుకొచ్చారు.