దేశంలో 75 శాతం పెద్దలకు వ్యాక్సినేషన్ పూర్తి

దేశంలో 75 శాతం పెద్దలకు వ్యాక్సినేషన్ పూర్తి

భారతదేశంలో 75 శాతం పెద్దలు పూర్తిగా టీకాలు తీసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ‘మొత్తం పెద్దలలో 75 శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు. ఈ మహత్తరమైన ఫీట్ కోసం సహకరించిన వారందిరికీ అభినందనలు. టీకా డ్రైవ్‌ను విజయవంతం చేస్తున్న వారిని చూస్తే గర్వంగా ఉంది’ అని ప్రధాని మోదీ ఆదివారం ట్వీట్ చేశారు.

దేశంలోని జనాభాలో 75 శాతానికి పైగా పెద్దవారు కోవిడ్ టీకాలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను ప్రధానమంత్రి మోడీ అభినందిస్తూ రీట్వీట్ చేశారు.

‘సబ్కా సాథ్, సబ్కా ప్రయాస్’ అనే మంత్రంతో దేశ జనాభాలో 75 శాతం మందికి వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయ్యాయి. కరోనాపై పోరాటంలో మనం మరింత బలపడుతున్నాం. అయినా కూడా మనం  అన్ని నియమాలను పాటించాలి. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ వేయించుకోండి’అని మాండవ్య ట్వీట్‌ చేశారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 16, 2021న ప్రారంభమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు 164.36 కోట్ల (1,64,36,66,725) కంటే ఎక్కువ వ్యాక్సిన్ డోసులు అందించినట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 12.43 కోట్ల కంటే ఎక్కువ (12,43,49,361) వ్యాక్సిన్లు నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది.