
హైదరాబాద్, వెలుగు: నీట్ రాసిన తెలంగాణ స్టూడెంట్లకు భారత వైద్య మండలి (ఎంసీఐ) మంచి వార్తను చెప్పింది. రాష్ట్రానికి కొత్తగా 750 ఎంబీబీఎస్ సీట్లను ఇస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. రెండు ప్రభుత్వ కాలేజీలు, మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు గుర్తింపునిచ్చింది. ఒక్కో కాలేజీకి 150 చొప్పున కొత్త సీట్లను కేటాయించింది. పోయినేడాది అనుమతి దక్కని నల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీలకు ఎంసీఐ ఈసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 1250 సీట్లుండగా కొత్త వాటితో కలిపి 1550కి చేరింది. ప్రైవేటు కాలేజీల్లోని సీట్లు 2100 నుంచి 2550కి పెరిగాయి. మైనారిటీ కాలేజీల్లోని సీట్లతో కలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు 4600 ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్ల పెరుగుదలపై వారం క్రితమే ‘వెలుగు’ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతి రావడం పట్ల ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. కాలేజీలకు నిధులిచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
85 శాతం మనోళ్లకే
ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లలో 85 శాతం సీట్లు రాష్ట్ర స్టూడెంట్లకే కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను నేషనల్ కోటాలో భర్తీ చేస్తారు. ఈ నేషనల్ కోటాలోనూ మన విద్యార్థులు సీట్లు పొందే అవకాశం ఉంటుంది. ప్రైవేటులోని 2550 సీట్లలో 1275 (50%) సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. సీట్లు పెరగడంతో నీట్లో మెరిట్ సాధించిన పేద, మధ్యతరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ కాలేజీల్లో ఫీజు ఏడాదికి ₹10 వేలు. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీటు సాధించిన వారికి ₹60 వేల ఫీజు ఉంటుంది. మిగిలిన వాటిలో సగం బీ కేటగిరీ కింద, మిగతా సగం సీట్లను సీ కేటగిరీ కింద విద్యార్థలుకు కేటాయిస్తారు. వాటినీ నీట్లో మెరిట్