జెండా విషయంలో పొరబాట్లు చేయవద్దు

జెండా విషయంలో పొరబాట్లు చేయవద్దు
  • ఆజాదీ కా మహోత్సవ్ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మువ్వన్నెల జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని మోడీ సర్కార్ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు పలు రాష్ట్రాల్లో వేడుకలను నిర్వహిస్తున్నారు. 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాలని.. నిబంధనలు పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో చాలా మంది జెండా ఎగురవేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఎగురవేశారు. 

జాతీయ జెండాను ఎగురవేసే సందర్భంలో కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే త్రివర్ణ పతాకాన్ని అవమానించేనట్లే అవుతుంది. ఫ్లాగ్ కడ్ 2022 రూల్స్ పాటించడం కంపల్సరి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై శిక్షలు పడడడమే కాకుండా జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. కనీసం మూడు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. అవమాన నిరోధక చట్టం - 1971, భారత పతాక స్మృతి - 2022లోబడి ఉంటాయి. 
 

ఇవి నిబంధనలు...

  • జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి.
  • చేనేత ఖాదీ, కాటన్ బట్టతో తయారైనది ఉండాలి.
  • జెండా తీసుకొనే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలి. చినగకూడదు, పాతగా ఉండకూడదు. నలిగిపోకూడదు.
  • జెండా మధ్యలో ఉండే ధర్మచక్రంలో 24 ఆకులు ఉండాలి.
  • జాతీయ జెండాను గౌరవప్రదంగా చూసుకోవాలి.
  • దుస్తులుగా కుట్టించుకోవద్దు.
  • రంగు రంగు కాగితాలను మాత్రమే అతికించాలి. ప్లాస్టిక్ పతాకాలు వాడకూడదు. 
  • జెండాను సరైన స్థలంలో ఎగురవేయాలి. 
  • జాతీయ జెండాను ఎగరవేసే ఎత్తుకు పైగా మరే ఇతర జెండా ఎగురవేయకూడదు.
  • ఎగురవేసేటప్పుడు కర్రకు జెండా కుడి వైపున ఉండాలి.
  • జెండా ఎగురవేసే సమయంలో చిరిగిపోకూడదు.
  • దానిపై ఎలాంటి రాతలు ఉండకూడదు. ఏ రంగు పైకి ఏ రంగు కిందకు ఉండాలో ముందుగానే తెలుసుకోవాలి.
  • మూడు రంగులు సమానంగా ఉండాలి. 
  • కాషాయ రంగు పైకి ఉంటే.. ఆకుపచ్చ రంగు దిగువన ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో తిరగబడి ఉండకూడదు.
  • ఎప్పుడూ నిటారుగా ఉండాలి. కిందకు వంచకూడదు.
  • అలంకరణకు జెండాను ఉపయోగించకూడదు.
  • ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పడేయకూడదు.