78 ఏళ్ల గ్యాంగ్ స్టర్ బామ్మ.. బ్యాంక్ దోపిడీలు చేస్తూ..

78 ఏళ్ల గ్యాంగ్ స్టర్ బామ్మ.. బ్యాంక్ దోపిడీలు చేస్తూ..

ఆమె వయస్సు 78 సంవత్సరాలు.. ఇప్పటికీ స్టిల్ బ్యాంకుల్లో దొంగతనాలు  చేస్తుంది.. ఏంటీ నమ్మకం కుదరటం లేదా.. ఇది పక్కా నిజం. అమెరికాకు చెందిన బొన్నీ గూచ్ అనేది మహిళ.. 78 ఏళ్ల వయస్సులో 2023.. అంటే ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన అమెరికాలోని మిస్సోరి ప్రాంతంలో గోపెర్ట్ ఫైనాన్షియల్ బ్యాంకులో దొంగతనం చేసి పారిపోతుండగా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అంతే కాదు.. ఆమె హిస్టరీ చూస్తే.. ప్రపంచంలోనే గ్యాంగ్ స్టర్  బామ్మగా గుర్తింపు పొందింది.. ఇప్పుడు అంటే ముసలి అయిపోయింది కానీ.. యంగ్ లో ఉన్నప్పుడు కూడా ముసలి వేషాలు వేసి బ్యాంకుల్లో దొంగతనం చేయటం ఆమె స్పెషాలిటీ అంటున్నారు పోలీసులు.. 

బొన్నీ గూచ్.. 1977లో కాలిఫోర్నియాలోని బ్యాంకులో దొంగతనం చేస్తూ పట్టుబడింది. అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లివచ్చింది. అప్పుడే బోనీ గూచ్ గురించి అసలు రంగు బయపడింది. 70 ఏళ్ల బామ్మలా మేకప్ వేసుకుని.. అలాంటి దుస్తులే ధరించి బ్యాంకులోకి వచ్చింది. సాయం కావాలని కోరుతూ బ్యాంగ్ ఉద్యోగులు, బ్యాంకుకు వచ్చిన ఖాతాదారుల బురిడీ కొట్టించి  డబ్బులు కొట్టేసేది.1977లో ఫస్ట్ టైం పట్టుబడినప్పుడే.. అప్పటికే నాలుగైదు దోపిడీలు చేసినట్లు ఒప్పుకుంది. కాలిఫోర్నియా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత.. కొన్నాళ్లు బాగానే ఉన్నా..మళ్లీ దొంగతనాలు చేయటం మొదలుపెట్టింది. ఓసారి పట్టుబడటంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చేది. రెండో సారి 2020లో 52 ఏళ్ల వయస్సులో దొంగతనాలు, దోపిడీల ఆరోపణలతో అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే బొన్నీ గూచ్ కుమారుడు.. తల్లి తరపున ఫైట్ చేశాడు. మా అమ్మ పిచ్చిది..ఆమె మానసిక స్థితి సరిగా లేదంటూ జైలు నుంచి బయటకు తీసుకొచ్చాడు. 

అప్పటి నుంచి పెద్దగా వెలుగులోకి రాని బొన్నీ గూచ్.. ఏప్రిల్ 6వ తేదీన.. 78 ఏళ్ల వయస్సులో మిస్సోరిలోని గోపెర్ట్ ఫైనాన్షియల్ బ్యాంకులో దొంగతనం చేసి వెళుతుండగా.. బ్యాంక్ సెక్యూరిటీ సిబ్బంది కారు నెంబర్ నోట్ చేసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెక్యూరిటీ సమాచారంతో ఛేజ్ చేసి కారును పట్టుకోగా.. అందులో బొన్నీ గూచ్ ఉంది. ఆమెను చూసి  షాక్ అయ్యారు. పూర్తి వివరాలు తెలిసి ఇంకా షాక్ అయ్యారు. బొన్నీ గూచ్ ఇంకా దోపిడీలు, దొంగతనాలు చేస్తుందా అని ఆశ్చర్యపోయారు. ప్రపంచంలోనే గ్యాంగ్ స్టర్ బామ్మ అంటూ అరెస్ట్ చేసి జైలులో వేశారు. 

40 ఏళ్ల దాటకపోయినా.. ఈ వయస్సులో ఏం పనులురా అంటారు.. 78 ఏళ్ల ముసలి వయస్సులో దోపిడీ, దొంగతనాలు చేస్తుంది అంటే నమ్ముతారా.. నమ్మాల్సిందే.. ఎందుకంటే అరెస్ట్ చేసి.. పోలీసులు జైల్లో కూడా పెట్టారు.. విచారణలో గ్యాంగ్ స్టర్ బామ్మ ఒప్పుకుంది కూడా.. నేనే దొంగతనాలు చేస్తుంది అనీ..