త్రివర్ణ శోభితం..ఓరుగల్లులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

త్రివర్ణ శోభితం..ఓరుగల్లులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఉమ్మడి ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరంగల్​జిల్లా కేంద్రంలో రెవెన్యూ శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హనుమకొండ పరేడ్​ గ్రౌండ్​లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ములుగులో పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్​లో ప్రభుత్వ విప్, డోర్నకల్​ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, జయశంకర్​భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

అనంతరం వారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, వేడుకల్లో పాల్గొన్నారు. కాగా, జిల్లాలోని ఆయా ప్రభుత్వ, ప్రైవేట్​కార్యాలయాలు, స్కూల్స్, వివిధ పార్టీలు, యువజన, కుల సంఘాల వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చీఫ్​గెస్ట్​లు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను సన్మానించి, ఉద్యోగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు.- వెలుగు, నెట్​వర్క్​