ఏం జరుగుతుందయ్యా : 7వ తరగతి పాప.. స్కూల్ లో గుండెపోటుతో..

ఏం జరుగుతుందయ్యా : 7వ తరగతి పాప.. స్కూల్ లో గుండెపోటుతో..

గుండెపోటు.. ఇది ఒకప్పుడు నడి వయసు వారికో.. వృద్దులకో వచ్చేది. ఇప్పుడు అలా కాదు.. చిన్న పిల్లలు, యువకులు, నడివయస్సు వారు, వృద్దులు అనేది లేకుండా అందరూ కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో ఈ మరణాలు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. క్రికెట్ ఆడుతూ ఒకరు.. బాత్ రూంలో స్నానం చేస్తూ బాలిక.. ఇలా చిన్న వయస్సులోనే కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం న్యూస్ లో చాలా చూశాం. తాజాగా కర్నాటకలో మరో బాలిక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తూ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం.. వివరాల్లోకి వెళితే.. 

కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లా 13ఏళ్ల బాలిక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తూ గుండెపోటు రావడంతో బుధవారం(డిసెంబర్20)న మృతిచెందింది.  ముదిగెర తాలూకాలోని కేశవులు జోగన్ననకెరె గ్రామానికి చెందిన 13ఏళ్ల సృష్టి అనే బాలిక స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. దారదహల్లి  ప్రాథమిక పాఠశాలకు వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. సృష్టిని ముదిగెరె పట్టణంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.