కరోనా కలకలం.. క్వారంటైన్‌‌లో రజనీకాంత్

కరోనా కలకలం.. క్వారంటైన్‌‌లో రజనీకాంత్
చెన్నై: సౌత్ సూపర్‌‌స్టార్ రజనీకాంత్ రీసెంట్‌‌గా అన్నాత్తే మూవీ షూటింగ్‌‌లో జాయిన్ అయ్యారు. అయితే ఈ సినిమా యూనిట్‌‌లో 8 మందికి కరోనా పాజిటివ్‌‌గా తేలారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా రజనీ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. లాక్‌‌డౌన్, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఫిల్మ్ షూటింగ్‌‌ కొన్ని నెలల పాటు ఆగిపోయింది. హైదరాబాద్‌‌లోని రామోజీ ఫిలిం సిటీలో డిసెంబర్ 14న అన్నాత్తే షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ మూవీకి సిరుత్తై సివ దర్శకత్వం వహిస్తుండగా.. నయనతార, కీర్తీ సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా అన్నాత్తే మూవీ సిబ్బందికి నిర్వహించిన టెస్టుల్లో 8 మంది కరోనా పాజిటివ్‌‌గా తేలారు. దీంతో రజనీతో సహా సినీ యూనిట్ మొత్తం రెండు వారాల పాటు క్వారంటైన్‌‌లో ఉండనున్నారు. త్వరలోనే రజనీ, నయనతార శాంపిళ్లను టెస్టింగ్‌‌కు ఇవ్వనున్నారు. ఈ వార్తను రజనీకాంత్ పబ్లికిస్ట్ రియాజ్ అహ్మద్ కన్ఫార్మ్ చేశారు. అయితే రజనీ చెన్నైకు తిరిగి వస్తారా లేక హైదరాబాద్‌‌లోనే క్వారంటైన్‌‌లో ఉంటారా అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.