‘ములుగు’లో ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమవుతున్న 8 వాగులు

‘ములుగు’లో ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమవుతున్న 8 వాగులు
  • వాటిని నదిలో ఎక్కడ కలపాలనే అంశపై రీసెర్చ్​కు రాష్ట్ర సర్కారు ఆదేశాలు
  • వ్యాప్ స్కో తో పాటు 8 మంది ఐఐటీ ప్రొఫెసర్ల కు బాధ్యతలు 
  •  రూ.137 కోట్ల కరకట్ట నిర్మాణ పనులకు మళ్లీ బ్రేక్


జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ములుగు జిల్లాలో గోదావరి ముంపు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఐదు మండలాల పరిధిలో గోదావరిలో కలిసే 8 వాగుల వల్లనే ముంపు ఎక్కువగా ఉంటోందని భావిస్తోంది. భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరాల దృష్ట్యా ఈ ఎనిమిది వాగులను గోదావరిలో ఎక్కడ కలపాలి? గోదావరి కరకట్టలను ఎలా నిర్మించాలి? అనే విషయంపై పూర్తి అధ్యయనం చేయనుంది. ఈ మేరకు నీటి పారుదల రంగంలో సర్వే చేసే వ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కో సంస్థతో పాటు 8 మంది ఐఐటీ ప్రొఫెసర్లకు బాధ్యతలు అప్పగించింది. కొన్ని రోజుల కింద ములుగు జిల్లాలో గోదావరి వరదల పరిశీలనకు వచ్చిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో మూడేండ్ల కింద గోదావరి కరకట్టల నిర్మాణం కోసం కేటాయించిన రూ.137 కోట్ల పనులకు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడినట్టయ్యింది. ఈ నివేదిక వచ్చిన తర్వాతనే పనులు చేస్తామని ఆఫీసర్లు 
చెబుతున్నారు. 

కొట్టుకుపోయిన 2 వేల ఎకరాలు

ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చినప్పుడల్లా ఒడ్డు కోతకు గురై రైతుల పంటలు నీట మునుగుతున్నాయి. ప్రతి యేటా వరదలతో ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో సుమారు 2 వేల ఎకరాలు నీటి పాలవుతున్నాయి.1986లో వచ్చిన వరదల తర్వాత 22 ఏండ్ల క్రితం అప్పటి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏటూరునాగారం మండలంలో గోదావరి నదికి కరకట్టలు నిర్మించారు. జంపన్నవాగు గోదావరిలో కలిసే చోట ఏటూరునాగారం ఆర్టీసీ బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఏటూరునాగారం, రామన్నగూడెం గ్రామాల మీదుగా 10 కి.మీ దూరం కరకట్ట నిర్మాణం జరిగింది. మొన్నటి వానలకు కరకట్టతో పాటు వరద కాల్వలు కూడా దెబ్బతిన్నాయి. 

నీట మునుగుతున్న 47 గ్రామాలు

ములుగు జిల్లాలోని 5 మండలాల్లో ఉన్న 47 గ్రామాలు గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా మునిగిపోతున్నాయి. వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లో వేలాది మంది ప్రజలు గోస పడుతున్నారు. ఇటీవల వచ్చిన వరదకు సుమారు 5 వేల మంది నిరాశ్రుయులయ్యారు. భారీ వర్షాలు పడి గోదావరి పొంగినప్పుడల్లా ఈ గ్రామాల ప్రజలను ఆఫీసర్లు అప్రమత్తం చేసి ప్రభుత్వ పునారావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 2015లో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన మంగపేట పుష్కరఘాట్ మూడేండ్ల కిందే కొట్టుకుపోయింది. ఈ ఏడాది రోడ్డు కూడా పాడై నీళ్లు మంగపేట ఊళ్లోకి వచ్చాయి. 

ఈ వాగుల వల్లే ప్రమాదం

గోదావరిలో కలిసే వాగుల వల్లనే తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఏటూరునాగారం దగ్గర కలిసే జంపన్న వాగు, రాంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర కలిసే జీడివాగు, మంగపేటలో కలిసే గౌరారం వాగు, కమలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర కలిసే ఎర్రవాగు, కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం దగ్గర హన్మంత వాగుతో పాటు వాజేడు, వెంకటాపురం మండలాల్లోని మరో 3 వాగుల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. వేలాది ఎకరాలు నీళ్లపాలవుతున్నాయి. ఇండ్లు కూలిపోయి జనాలు రోడ్డున పడుతున్నారు. దీంతో ఈ వాగులపై పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే కరకట్ట నిర్మాణ పనులు మొదలుపెట్టాలని సీఎం కేసీఆర్​ నీటి పారుదల శాఖ ఆఫీసర్లు, ములుగు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు.  

రూ.137 కోట్ల పనులకు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాలో గోదావరి కరకట్టల నిర్మాణం కోసం 2019లో రూ.137 కోట్లను కేటాయించింది. మూడేండ్లవుతున్నా కనీసం టెండర్లు కూడా పిలవలేదు. అయితే ఇప్పుడు వాగులపై రీసెర్చ్ ​చేసిన తర్వాతే కరకట్ట పనులు చేయాలని ఆదేశించడంతో  రూ.137 కోట్ల పనులకు బ్రేక్​ పడింది.  

రిపోర్ట్​ వచ్చాక పనులు షురూ 

గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా ములుగు జిల్లాలోని వందలాది గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. వేలాది  ఎకరాల వ్యవసాయ భూములు కోతకు గురవుతున్నాయి. కొన్నేండ్ల నుంచి ఈ సమస్య పెరుగుతూ వస్తోంది. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశాల ప్రకారం జిల్లాలో గోదావరిలో కలిసే 8 వాగులపై అధ్యయనం చేసి, పూర్తి నివేదిక రాగానే కరకట్టల నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.  

- కృష్ణ ఆదిత్య, ములుగు జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

విలువైన భూములు గోదావరిలో కలిసిపోతున్నాయి  

గోదావరి వరదలతో గంపోనిగూడెం నుంచి మంగపేట పుష్కరఘాట్ వరకు పొలాలు నీట మునుగుతున్నాయి. మొన్నటి వానలకు మంగపేట కూడా మునిగింది. రానున్న రోజుల్లో మంగపేట గ్రామం ఉనికికే ముప్పు పొంచి ఉంది. గోదావరి పెరిగినప్పుడల్లా పొదుమూరులోని ఇండ్లలోకి నీరు చేరుతోంది. అలాంటి సందర్భాల్లో   నాయకులు వచ్చి కరకట్ట నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి వెళ్లిపోతున్నారు. వారి మాటలు నీటిమీద రాతలుగానే ఉంటున్నాయి.

‒ జవంగుల చంద్రశేఖర్, మంగపేట మాజీ సర్పంచ్, ములుగు జిల్లా