వైరల్: 11 ఫీట్ల పైతాన్‌‌తో ఈత కొడుతున్న 8 ఏళ్ల బాలిక

వైరల్: 11 ఫీట్ల పైతాన్‌‌తో ఈత కొడుతున్న 8 ఏళ్ల బాలిక

న్యూఢిల్లీ: స్విమ్మింగ్‌‌ను ఇష్టపడని వారు ఉంటారా చెప్పండి. ఉరుకుల పరుగుల జీవితంలో ఫిట్‌నెస్‌‌ను పెంచుకోవడంతోపాటు హాయిగా సేద తీరాలంటే ఈత కొలనులో దిగాల్సిందే మరి. కొందరు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలసి పూల్‌‌లో సరదాగా గేమ్స్ ఆడుతూ ఈదుతుంటారు. కానీ ఇక్కడ ఓ అమ్మాయి ఎంచుకున్న స్విమ్మింగ్ పార్ట్‌‌నర్‌‌ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే. ఇజ్రాయెల్‌‌కు చెందిన ఇన్బార్ అనే ఓ ఎనిమిదేళ్ల బాలిక ఏకంగా 11 ఫీట్ల భారీ పైతాన్‌‌తో కలసి ఈత కొడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అవును మీరు చదివింది నిజమే.

బెల్లే అనే పైతాన్‌‌తో కలసి ఈత కొట్టడాన్ని సదరు బాలిక ఎంజాయ్ చేస్తుండటం విశేషం. వాల్డ్ డిస్నీ పాపులర్ సిరీస్ అయిన బ్యూటీ అండ్ ది బీస్ట్ స్ఫూర్తితో ఆ పైతాన్‌‌కు బెల్లే అని పేరు పెట్టారట. ఇన్బార్ తల్లిదండ్రులు సౌతర్న్ ఇజ్రాయెల్‌‌లోని ఒక జంతువుల అభయారణ్యంలో ఉంటారని సమాచారం. ఇన్బార్‌ చిన్నప్పటి నుంచి యానిమల్స్ సాంక్చురీలో పెరగడంతో తనకు జంతువులతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. బెల్లే తాము పెంచుకున్న ఓ పెట్ యానిమల్ అని ఇన్బార్ పేరెంట్స్ చెప్పారు. కరోనా కారణంగా స్కూళ్లు మూతబడటంతో బెల్లేతో ఇన్బార్‌‌కు మంచి ఫ్రెండ్‌‌షిప్ ఏర్పడిందని పేర్కొన్నారు.