
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనాపై టారిఫ్‌లను 145 శాతం నుంచి 80 శాతానికి తగ్గించాలని చూస్తున్నారు. ఈ నెల 10న అమెరికా, చైనా టాప్ అధికారుల మధ్య స్విట్జర్లాండ్‌లో మీటింగ్ జరగనుంది. యూఎస్, చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్‌ను తగ్గించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఆయన ట్రేడ్ వార్ ప్రారంభించిన తర్వాత, మొదటిసారిగా రెండు దేశాల టాప్ అధికారులు మీట్ అవుతున్నారు.
చైనాపై 80 శాతం టారిఫ్ సరైనదేనని ట్రంప్ శుక్రవారం ఉదయం తన సోషల్ మీడియా అకౌంట్‌లో పేర్కొన్నారు. యూఎస్ ట్రెజరీ చీఫ్ స్కాట్ బెసెంట్ మిగిలినది డిసైడ్ చేస్తాడని అన్నారు. కాగా, స్కాట్ బెసెంట్, యూఎస్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ జామీసన్ గ్రీర్‌లు చైనా వైస్ ప్రీమియర్ హీ లిఫెంగ్‌తో జెనీవాలో మీట్ కానున్నారు.