పోలీసుల పనితీరుపై ఫీడ్‌‌ బ్యాక్‌‌..80 శాతం పాజిటివ్​ రెస్పాన్స్​.. 20 శాతం నెగెటివ్​

పోలీసుల పనితీరుపై ఫీడ్‌‌ బ్యాక్‌‌..80 శాతం పాజిటివ్​ రెస్పాన్స్​.. 20 శాతం నెగెటివ్​
  • సిటిజన్ ​క్యూఆర్​ కోడ్​ ద్వారా సమాచార సేకరణ
  • ప్రతి పోలీస్‌‌స్టేషన్‌‌లో 5 క్యూఆర్ కోడ్‌‌ స్టిక్కర్లు
  • ఇంగ్లిష్‌‌, తెలుగులో ప్రశ్నలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులు
  • 3 నెలల్లో 8,500 మంది సిటిజన్ల నుంచి ఫీడ్‌‌ బ్యాక్‌‌
  • 80 శాతం పాజిటివ్​ రెస్పాన్స్​.. 20 శాతం నెగెటివ్​ 
  • ఫీడ్‌‌ బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు

హైదరాబాద్, వెలుగు: పోలీసులపై  అవినీతి ఆరోపణలు, పోలీస్‌‌స్టేషన్లలో బాధితులకు అందుతున్న సేవలకు సంబంధించి అమల్లోకి వచ్చిన ‘క్యూఆర్ కోడ్‌‌’ సిటిజన్‌‌ ఫీడ్‌‌ బ్యాక్‌‌ సత్ఫలితాలను ఇస్తున్నది. పోలీసుల పనితీరు, బాధితులతో ప్రవర్తన, ఫిర్యాదులు సహా మెరుగైన సేవలకు డిపార్ట్‌‌మెంట్‌‌ తీసుకోవాల్సిన చర్యలపై సిటిజన్ల నుంచి సలహాలు, సూచనలు హెడ్‌‌ క్వార్టర్స్ కు  అందుతున్నాయి. క్యూఆర్‌‌‌‌ కోడ్‌‌ అమల్లోకి వచ్చిన 3 నెలల వ్యవధిలోనే 8,500 మంది నుంచి ఫీడ్ బ్యాక్‌‌ వచ్చింది. ఇందులో దాదాపు 80 శాతం మంది పోలీస్‌‌ సర్వీస్​ బాగానే ఉందని ఫీడ్‌‌ బ్యాక్ ఇచ్చారు. కొన్ని సేవలకు అవసరమైన సలహాలు, సూచనలు చేశారు.  దాదాపు 20 శాతం మంది పోలీసుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. తమ ఫిర్యాదులను అధికారులు పట్టించుకోలేదని, దురుసు ప్రవర్తన, వివిధ కారణాలు చెప్తూ తిప్పించుకోవడం లాంటి ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. 

ఎస్పీ, డీసీపీ ఆఫీసులు,పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్లలో క్యూఆర్ కోడ్స్‌‌‌‌‌‌‌‌

రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించే క్రమంలో పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ గత కొంతకాలంగా సిటిజన్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నది. మొదట్లో ‘ఇంట్రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌)తో ఫీడ్‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌ తీసుకునేవారు. పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు చేసే బాధితుల ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్ల ఆధారంగా ర్యాండమ్‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌ చేసేవారు.  పోలీస్‌‌‌‌‌‌‌‌ సేవలు సంతృప్తిని ఇచ్చాయా? లేదా? అనే వివరాలను బాధితుల నుంచి సేకరించేవారు. దీనికి తగ్గట్టుగా ఈ ఏడాది జనవరి 9వ తేదీ నుంచి నేరుగా బాధితులే ఫీడ్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చే విధంగా క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌  స్కాన్ విధానం అమలు చేస్తున్నారు. బాధితులకు అందుబాటులో ఉండేలా ప్రతి పోలీస్ స్టేషన్ సహా డీసీపీలు, ఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ పరిసర ప్రాంతాల్లో 5 క్యూఆర్‌‌‌‌‌‌‌‌ కోడ్ స్కాన్లర్లు తప్పని సరి చేశారు. కోడ్ స్కాన్‌‌‌‌‌‌‌‌ చేసి అందులో పేర్కొన్న అంశాలవారీగా సమాచారం సేకరిస్తున్నారు.

ఫీడ్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా చర్యలు

క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌ స్కానింగ్‌‌‌‌‌‌‌‌ ద్వారా బాధితులు తమ అభిప్రాయాలను ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చు. కోడ్‌‌‌‌‌‌‌‌ స్కాన్‌‌‌‌‌‌‌‌ చేస్తే ఇంగ్లిష్​, తెలుగులో పోలీసుల గురించి ప్రశ్నలు ఉంటాయి. పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లిన తర్వాత పోలీసులు తమతో వ్యవహరించిన తీరుకు సంబంధించిన వివరాలను ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా వెల్లడించాలి. ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌, ఈ చలాన్‌‌‌‌‌‌‌‌(ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ ఉల్లంఘనలు), పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్​ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌ ఇలా ఇతర అంశాలపై కూడా సలహాలు సూచనలు, ఫిర్యాదులు చేయొచ్చు.  ఇలా అందిన సమాచారం ఆధారంగా  ప్రజల అభిప్రాయాలు విశ్లేషించి..  అవసరమైన చర్యలు చేపడుతున్నారు. క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ స్కాన్ చేసి అభిప్రాయాలు తెలియజేసే సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బంది తమకు అనుకూలంగా ఫీడ్‌‌‌‌‌‌‌‌ బ్యాక్ ఇప్పించు కుంటున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో నివేదిక అందించాలని ఆయా యూనిట్‌‌‌‌‌‌‌‌ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.