
గొర్రెల మందపై కుక్కులు మూకుమ్మడిగా దాడి చేయడంతో పెద్ద సంఖ్యలో గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడలో జరిగింది.కడబోయిన మల్లయ్య,కొంరయ్య చెందిన గోర్లనే మేపేందుకు గ్రామ శివారులోని ఓ పొలంలో ఏర్పాటు చేసిన కంచెలో గొర్లను ఉంచారు. గొర్రెల మందపై ఊర కుక్కలు దాడి చేయడంతో సుమారు 80,గుర్రెలు,20 గొర్రె పిల్లలు చనిపోయాయి. చేతికి అంది వచ్చిన గొర్రెలు చనిపోవడంతో గొర్రెల పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు బాధితులు.