
మీరు ఐఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఐఫోన్లో మీరు ఉపయోగించని లేదా మీకు తెలియని చాల ఫీచర్లు ఉండే ఉంటాయి. ఒకోసారి వీటి గురించి తెలియకపోయిన వీటి వల్ల కలిగే నష్టం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఐఫోన్‌లో మీకు తెలియకుండానే మీ లొకేషన్ ఇంకా నెట్‌వర్క్ ట్రాక్ చేసే ఒక ఫీచర్ ఉంది, అది ఇప్పటికీ మీ ఫోన్‌లో ఆన్‌లో ఉండవచ్చు. ఈ ఫీచర్ పేరు వైఫై ట్రాకింగ్. మీ డిజిటల్ గోప్యత కోసం దీన్ని వెంటనే ఆఫ్ చేయడం చాలా ముఖ్యం.
ఈ ఫీచర్ ఎం చేస్తుందంటే : ఐఫోన్‌లో నెట్‌వర్కింగ్ & వైర్‌లెస్ అనే సెట్టింగ్ ఉంటుంది, ఇది లొకేషన్ సర్వీసెస్ కింద పనిచేస్తుంది. ఈ ఫీచర్ మీ చుట్టూ ఉన్న వై-ఫై నెట్‌వర్క్‌లను స్కాన్ చేస్తుంది అలాగే ఆ సమాచారాన్ని ఉపయోగించి మీ లొకేషన్ అంచనా వేస్తుంది. మీరు వైఫైని ఆఫ్ చేసినగాని ఇది పని చేస్తూనే ఉంటుంది. అంటే WiFi ఆఫ్‌లో ఉన్నప్పటికీ మీ iPhone నెట్‌వర్క్‌లను స్కాన్ చేస్తూనే ఉంటుంది ఇంకా మీ లొకేషన్ సంబంధించిన డేటాను పంపుతుంటుంది.
ఆపిల్ ఏం చెబుతుందంటే : ఈ ఫీచర్ మంచి నెట్‌వర్క్ కనెక్టివిటీ, లొకేషన్ సేవలను అందించడమే అని ఆపిల్ పేర్కొంది, అయితే నిజం ఏమిటంటే ఇది మీ గోప్యత, మీ ఫోన్ బ్యాటరీ రెండింటిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
వై-ఫై ట్రాకింగ్‌ను ఎందుకు ఆఫ్ చేయాలి: దీని వల్ల మీ లొకేషన్ లీక్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. మీ అనుమతి లేకుండానే మీ డేటా షేర్ కావొచ్చు. అలాగే బ్యాటరీ వేగంగా అయిపోతుంది, ఎందుకంటే ఫోన్ ఎప్పటికప్పుడు నెట్‌వర్క్‌లను స్కాన్ చేస్తుంది. మరోవైపు మీ పర్సనల్ డేటా ప్రమాదంలో పడొచ్చు. ఎందుకంటే కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ మీ డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. ఒకోసారి పబ్లిక్ వై-ఫై వాడటం వల్ల మీ ఫోన్ సైబర్ దాడికి గురయ్యే ఛాన్స్ ఉంది.
వై-ఫై ట్రాకింగ్‌ను ఎలా ఆఫ్ చేయాలి అంటే :
1. ముందు మీ iPhone సెట్టింగ్లకు వెళ్లండి.
2. క్రిందికి స్క్రోల్ చేసి Privacy & Securityపై నొక్కండి.
3. తర్వాత Location Services ఆప్షన్‌కి వెళ్లండి
4. కిందకు వెళ్లి System Services క్లిక్ చేయండి.
5. ఇక్కడ మీరు Networking & Wireless అప్షన్ కనిపిస్తుంది.
6. దీనిపై క్లిక్ చేసి ఆఫ్ చేయండి.
ఈ సెట్టింగ్‌ను ఆఫ్ చేయడం వల్ల మీ ఐఫోన్ Wi-Fiకి ఎలాంటి సమస్య ఉండదు. ఒకే ఒక్క తేడా ఏమిటంటే మీ లొకేషన్ ఇకపై WiFi నెట్‌వర్క్‌ల ద్వారా ట్రాక్ కాదు. WiFi కనెక్టివిటీ ఇబ్బంది కావచ్చని Apple మీ iPhoneలో పాప్-అప్ అలెర్ట్ చూపిస్తుంది, కానీ మీరు Turn Off క్లిక్ చేయాలి.