
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2025లో కంపెనీ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది. అయితే వచ్చేవారం జూలై 9న జరగనున్న ఈ ఈవెంట్‌లో గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 లాంచ్ కానున్నాయి. చాలా కాలంగా వస్తున్న సమాచారం ప్రకారం మరో ఫోల్డబుల్ ఫోన్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE గురించి కూడా చర్చ జరుగుతోంది. విషయం ఏంటంటే ఈ ఏడాది కంపెనీ తక్కువ ధరకే ఫోల్డబుల్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేయవచ్చు. ఇదే జరిగితే కంపెనీ మొత్తంగా మూడు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు Samsung Galaxy Z ఫోల్డ్ 7, Galaxy Z ఫ్లిప్ 7 సహా Galaxy Z ఫ్లిప్ 7 FEని ఈ ఈవెంట్‌లో ప్రవేశపెట్టవచ్చు.
ఈ ఈవెంట్ ముందే స్మార్ట్‌ఫోన్ కవర్లను తయారు చేసే సంస్థ స్పిజెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లైన గెలాక్సీ Z ఫ్లిప్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE రెండింటి కవర్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూపించింది. కొంత సమయం తర్వాత వెంటనే డిలేట్ చేసింది. దీని బట్టి చిస్తే ఫోన్ లుక్ ముందే లీక్ కాకుండా చూస్తుంది. అయితే శాంసంగ్ ఈవెంట్‌లో కంపెనీ బడ్జెట్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు కంపెనీ ఫ్లిప్ ఫోన్ ఫ్యాన్ ఎడిషన్ (FE)ని లాంచ్ చేయలేదు, ఇదే మొదటిసారి. కానీ ఇప్పటివరకు శాంసంగ్ ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే :
సమాచారం ప్రకారం శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లతో పాటు తక్కువ ధరతో ఫ్లిప్ మోడల్‌ను తీసుకురావొచ్చు. ఇది గెలాక్సీ Z ఫ్లిప్ 7 కంటే తక్కువ బరువు ఉంటుంది. ఇంకా శాంసంగ్ ఈ ఫోన్ మోటరోలా రేజర్ సిరీస్‌కు గట్టి పోటీని ఇస్తుంది. ఈసారి కంపెనీ సొంత ఎక్సినోస్ చిప్‌సెట్ కాకుండా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో ఫోన్‌లను తీసుకురావచ్చని చెబుతున్నారు. FE ఎడిషన్ గురించి మాట్లాడితే గెలాక్స్ Z ఫ్లిప్ 6లాగే కవర్ డిస్‌ప్లే ఉండొచ్చు. అలాగే కంపెనీ Exynos 2400e చిప్‌సెట్‌తో ఫోన్‌ను తీసుకురావచ్చు, ఇది Exynos 2400కి లైట్ వెర్షన్. దీని వల్ల కంపెనీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకు లాంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది.