కక్ష సాధింపులు సరికాదు.. బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గం : ప్రెసిడెంట్ అనిల్ గౌడ్

కక్ష సాధింపులు సరికాదు.. బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గం : ప్రెసిడెంట్ అనిల్ గౌడ్
  • ప్రెసిడెంట్ అనిల్ గౌడ్

బాల్కొండ,వెలుగు: వ్యక్తిగత రాజకీయ కక్షసాధింపులు సరి కాదని ‘ఏ’ బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెసిడెంట్ అనిల్ గౌడ్ అన్నారు. శనివారం బాల్కొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజలకు పథకాల చేరవేతకు సమర్థవంతంగా పని చేయాల్సిన ఎమ్మెల్యే రాజకీయంతో వ్యాపారాన్ని ముడివేయద్దన్నారు. అభివృద్ధి, సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ఉండాలని కోరారు. నియోజకవర్గ ఇన్​చార్జి ముత్యాల సునీల్ కుమార్ తన వ్యక్తిగత బిజినెస్ కు సంబంధించి జీఎస్టీ అంశం చట్ట పరిధిలో విచారణ జరిగిందని గుర్తుచేశారు.

వ్యక్తిగతంగా రాజకీయంగా వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం సరైంది కాదన్నారు. ప్రజాపాలనలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు.  కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టింటి ముత్యం రెడ్డి, బాల్కొండ, వేల్పూర్, పార్టీ ముప్కాల్ మండల ప్రెసిడెంట్లు వెంకటేశ్​ గౌడ్, నర్సారెడ్డి, ముత్యం రెడ్డి, సర్పంచ్​లు, ఉప సర్పంచ్​లు, పార్టీ లీడర్లు పాల్గొన్నారు.