సదాశివనగర్, (రామారెడ్డి) వెలుగు : రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి(రామారెడ్డి) గ్రామంలోని కాల భైరవ స్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. శనివారం నూతన ఆలయ అభివృద్ధి కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించగా, వారు ఎమ్మెల్యేను సన్మానించి స్వామివారి ఫొటో అందజేశారు. స్వామివారికి పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.
అధ్యక్షుడిగా చింతల శంకర్, డైరెక్టర్లుగా తూర్పురాజు, ఎర్రోళ్ల పెద్ద స్వామి, ఆకుల గంగారాజం గౌడ్, భుక్యా రాంసింగ్, షేట్పల్లి భైరయ్య, షేట్ పల్లి రాజు ఎండ్రియాల గోపాల్, బత్తుల రాంరెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రభు, అర్చకులు శ్రీనివాస్ శర్మ, కాంగ్రెస్ రామారెడ్డి మండలాధ్యక్షుడు ప్రవీణ్‌గౌడ్, సొసైటీ మాజీ వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి పాల్గొన్నారు.
