
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాటారం మండలం మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద వాహనదారులు నిరసనకు దిగారు. లోకల్ వాహన దారుల దగ్గర డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆందోళన చేశారు. కాటారం మండలంలోని కారు యాజమాన్యం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. కాటారం మండల కేంద్రానికి కేవలం 10 కిలో మీటర్లు దూరంలో టోల్ ప్లాజా ఉండటం గమనార్హం. లోకల్ వాహనాల నుంచి టోల్ వసూళ్లు చేయొద్దంటూ కార్లు రోడ్డుకు అడ్డంగా నిలిపి నిరసన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో.. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఆర్టీసీ బస్సులు, లారీలు, ప్రైవెట్ వాహనాలు ఇరువైపుల నిలిచిపోయాయి. మేడిపల్లి జాతీయ రహదారి 353 Cపై ఉన్న టోల్ ప్లాజా దగ్గర వాహనదారుల నుంచి అక్రమంగా టోల్ వసూలు చేస్తున్నారని ఇటీవల బీఆర్ఎస్ యువజన విభాగం నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. టోల్ ప్లాజా దగ్గర మంచి నీటి సదుపాయం గానీ, టాయ్ లెట్స్ గానీ లేవని బీఆర్ఎస్ ఆరోపించింది. కాటారం సబ్ డివిజన్ లోని ఐదు మండలాల వాహనదారుల నుంచి టోల్ రూపంలో నిర్వాహకులు దండుకుంటున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది.
ALSO READ | హైదరాబాద్ SR నగర్ క్రిష్ ఇన్ హోటల్లో ఫైర్ యాక్సిడెంట్