తెలంగాణలో ఒక్కరోజే 8 వేలకు పైగా కేసులు..38 మరణాలు

తెలంగాణలో ఒక్కరోజే 8 వేలకు పైగా కేసులు..38 మరణాలు

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత రెండు మూడు రోజులుగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,126 కొత్త కేసులు నమోదవ్వగా మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య3,95,232 కు చేరగా మరణాల సంఖ్య 1999కి చేరింది. నిన్న మరో 3307 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,30,304 కు చేరింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1259, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 676, రంగారెడ్డి 591,నిజామాబాద్  లో 497 కేసులు నమోదయ్యాయి.