క్రికెట్‌‌‌‌ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 రన్స్‌‌‌‌

క్రికెట్‌‌‌‌ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 రన్స్‌‌‌‌

న్యూఢిల్లీ: క్రికెట్‌‌‌‌ చరిత్రలో పెను సంచలనం నమోదైంది. జింబాబ్వే డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో 50 ఓవర్ల మ్యాచ్‌‌‌‌లో ఓ జట్టు ఏకంగా 822 రన్స్‌‌‌‌ సాధించి క్రికెట్‌‌‌‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మాస్వింగో వన్డే ఫస్ట్‌‌‌‌ లీగ్‌‌‌‌లో భాగంగా సోమవారం స్కార్పియన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ క్లబ్‌‌‌‌, మీథెన్ లయన్స్‌‌‌‌ జట్ల మధ్య మ్యాచ్‌‌‌‌ జరిగింది. ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన స్కార్పియన్‌‌‌‌ జట్టు 50 ఓవర్లలో 822/4 స్కోరు చేసింది. 

ఓపెనర్లు తకుండా మెడెంబో (143 బాల్స్‌‌‌‌లో 50 ఫోర్లు, 7 సిక్స్‌‌‌‌లతో 302), విన్‌‌‌‌ఫ్రెడ్‌‌‌‌ మాటెండే (75 బాల్స్‌‌‌‌లో 23 ఫోర్లు, 13 సిక్స్‌‌‌‌లతో 203), గాబ్రియెల్‌‌‌‌ జయ (49 బాల్స్‌‌‌‌లో 22 ఫోర్లతో 110), విన్సెంట్‌‌‌‌ మొయో (78) పరుగుల సునామీ సృష్టించారు. ఇందులో 108 ఎక్స్‌‌‌‌ట్రాలు ఉండటం గమనార్హం. ప్రతి బౌలర్‌‌‌‌ వందకు పైగా రన్స్‌‌‌‌ ఇచ్చుకున్నారు. 

తర్వాత ఛేజింగ్‌‌‌‌కు దిగిన మీథెన్‌‌‌‌ లయన్స్‌‌‌‌ 28 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. ఫలితంగా స్కార్పియన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ క్లబ్‌‌‌‌ 794 రన్స్‌‌‌‌ భారీ తేడాతో విజయం సాధించింది. ఒకవేళ ఇది అధికారిక లిస్ట్‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌ అయ్యి ఉంటే వరల్డ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ హిస్టరీలో అతిపెద్ద రికార్డుగా నిలిచిపోయేది. ఈ మ్యాచ్‌‌‌‌కు సంబంధించిన స్కోరు కార్డు సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌గా మారింది.